Begin typing your search above and press return to search.

UK ఇస్కాన్ కృష్ణ‌దాస్ కీర్త‌న‌లో విరుష్క‌

అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ 2017 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు

By:  Tupaki Desk   |   14 July 2024 8:31 AM GMT
UK ఇస్కాన్ కృష్ణ‌దాస్ కీర్త‌న‌లో విరుష్క‌
X

అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ 2017 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ఈ జంట తమ గోప్యతను కాపాడుకోవడానికి శాశ్వతంగా లండన్‌కు స్థావరాన్ని మార్చుకుంటున్నట్లు ఇటీవ‌ల మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఈ అంద‌మైన జంట‌ తరచుగా లండన్‌లో కెమెరా కంటికి చిక్కుతున్న సంగ‌తి విధిత‌మే.

గత సంవత్సరం ఒక ప్రకటనలో అనుష్క శ‌ర్మ మాట్లాడుతూ, ``నేను నటనను ఆస్వాధిస్తాను.. కానీ నేను ఇంతకు ముందు చేసినంతగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. సంవత్సరానికి ఒక సినిమా చేయాలని, నాకు నచ్చిన నటనను ఆస్వాధించాలని.. నా జీవితాన్ని నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటూనే, నా కుటుంబానికి సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు. కోహ్లి కూడా ``మేము దేశంలో లేము. రెండు నెలల పాటు సాధారణ వ్య‌క్తులుగా అనుభూతిని పొందడం .. నాకు, నా కుటుంబానికి ఒక గొప్ప‌ అనుభవం. కుటుంబంతో గడిపే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞత కలిగి ఉండకపోవచ్చు. రహదారిపై వెళుతుంటే ఎవ‌రో ఓ వ్యక్తిగా ఉండటం.. ప్రైవ‌సీకి భంగం క‌లిగేలా గుర్తించబడకపోవడం అద్భుతమైన అనుభవం`` అని అన్నారు. వారి మాట‌ల‌ను బ‌ట్టి దంప‌తులు ఇరువురూ ప్రైవ‌సీని ఎంత‌గా మిస్స‌వుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఫిబ్రవరిలో లండన్‌లో తమ రెండవ కిడ్ అకాయ్‌కి స్వాగతం పలికారు. ప్రెగ్నెన్సీని ప్రైవేట్‌గా ఉంచేందుకు దంపతులు యూకే వెళ్లారు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ ఫిబ్రవరి 20న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ రెండవ బిడ్డ అకాయ్‌కు జన్మనిచ్చామ‌ని ప్రకటించారు. గత నెలలో ఈ జంట‌ లండన్‌కు వెళ్లార‌ని క‌థ‌నాలొచ్చాయి. అకాయ్ అక్కడే జన్మించాడు.

అయితే విరుష్క దంప‌తుల బిడ్డ జన్మస్థలం లండన్ అయినందున బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందుతుందా? అని చాలా మంది ఆశ్చర్యం వ్య‌క్తం చేసారు. తండ్రి కోహ్లికి UK రాజధానిలో నివాస ప్రాపర్టీని కలిగి ఉన్నందున అకాయ్‌కి బ్రిటిష్ పౌరసత్వం మంజూరు అవుతుంద‌ని నమ్మే కొందరు అభిమానులు ఉన్నారు. అయితే UKలో ఒక పిల్లవాడు పౌరసత్వం పొందేందుకు ఇవి రెండూ సరిపోవు. దేశంలో పౌరసత్వాన్ని నియంత్రించే చట్టాల ప్రకారం UKలో పుట్టిన ప్రతి బిడ్డ పౌరసత్వం పొందేందుకు అర్హులు కాదు. ఆ బిడ్డ‌ తల్లిదండ్రులలో ఒకరు UK పౌరసత్వం కలిగి ఉన్నప్పుడు లేదా సుదీర్ఘకాలం దేశంలో స్థిరపడినప్పుడు మాత్ర‌మే సాధ్యం కావొచ్చు అని తెలుస్తోంది.

కృష్ణ‌దాస్ కీర్త‌న‌లో విరుష్క‌:

ప్రస్తుతం తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి లండన్‌లో ఉన్న అనుష్క శర్మ యూనియన్ చాపెల్‌లో కృష్ణ దాస్ కీర్తనకు హాజరయ్యారు. `రాక్ స్టార్ ఆఫ్ యోగా` అని పిలుపందుకున్న‌ కృష్ణ దాస్ సాంప్రదాయ భారతీయ శ్లోకాన్ని సమకాలీన సంగీతంతో మిళితం చేశారు. కీర్తన నుండి ఈ జంటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.

నిజానికి జెఫ్రీ కాగెల్ ఆయ‌న అస‌లు పేరు.. అత‌డు 1960లో తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. భారతదేశానికి వెళ్లి నీమ్ కరోలి బాబాకు శిష్యుడు అయ్యారు. అనంత‌రం కృష్ణ దాస్ గా మారారు. కృష్ణ దాస్ కి అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ ఇద్దరూ భక్తులు. అనుష్క కీర్తనలోని ఫోటోల‌ను షేర్ చేయ‌డ‌మే గాక‌.. కృష్ణ దాస్‌ను ట్యాగ్ చేసింది. విరాట్ -అనుష్క గతేడాది కూడా లండన్‌లో కృష్ణ దాస్ కీర్తనకు హాజరయ్యారు. అంతకుముందు, గత సంవత్సరం లండన్‌లో కృష్ణ దాస్ కీర్తనను ఆస్వాదిస్తున్న జంట పాత వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. జులై 4న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మెరైన్ డ్రైవ్‌లో టీమ్ ఇండియా విజయోత్సవ పరేడ్‌లో పాల్గొన్న తర్వాత కోహ్లీ వెంటనే లండన్‌కు బయలుదేరాడు. అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇటలీలోని టుస్కానీలో 2017 డిసెంబర్ 11న బోర్గో ఫినోచిటోలో వివాహం చేసుకున్నారు.