Begin typing your search above and press return to search.

నాన్న‌కు ప్రేమ‌తో మంజుల ఘ‌ట్ట‌మ‌నేని!

2022 ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబంలో ఎన్నో చేదు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:39 AM GMT
నాన్న‌కు ప్రేమ‌తో మంజుల ఘ‌ట్ట‌మ‌నేని!
X

2022 ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబంలో ఎన్నో చేదు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒకే ఏడాది ర‌మేష్ బాబు..ఇందిరా దేవి... కృష్ణ స్వ‌ర్గుస్తుల‌య్యారు. స‌రిగ్గా సూప‌ర్ స్టార్ కృష్ణ స్వ‌ర్గ‌స్తులై నేటికి (న‌వంబ‌ర్ 15) ఏడాది పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో తొలి వ‌ర్దంతి సంద‌ర్భంగా అభిమానులంతా కృష్ణ‌ని స్మ‌రించుకుని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టుల‌తో నివాళులు అర్పిస్తున్నారు.

వెండి తెర‌పై ఆయ‌న చేసిన సాహ‌సాలు.. పాత్ర‌లు...స‌మాజ సేవ‌ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా కుమార్తె మంజుల కూడా ఓ ఓమోష‌న‌ల్ పోస్ట్ చేసారు.'ప్రియమైన నాన్నా.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లి ఏడాది అవుతోంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. కానీ ప్రతీ క్షణం మీరు మా పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. మీ ఇంట్లోనే ఉంటున్నాం. షూట్ నుంచి అయినా.. వంద రోజుల ఫంక్షన్ నుంచైనా అవుట్ డోర్ షూట్ నుంచి అయినా కూడా మీరు వెంటనే ఇంటికి వచ్చేస్తుంటారు.

వెంటనే మళ్లీ సాధారణ జీవితంలోకి వస్తారు. పనిలో నిమగ్నమైన మీలాంటి వారి కోసం.. ఏదో ఒకవిధంగా మీరు అందరికీ ఒకేసారి అందుబాటులో ఉండగలిగేవారు. అన్ని బాధ్యతలు నిర్వర్తించేవారు. ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తుండేవారు. మీరు మీ వృత్తి ప‌రంగా ఎన్నో అద్బుతాలు చేసారు. కానీ వ్య‌క్తిగ‌త జీవితం ఇంకెన్ని అద్భుతాలు చేసారో? ఈ ప్రపంచానికి తెలియదు.

మీరు ఎక్క‌డున్నా కుటుంబం కోసం..ఇంటికోసం ఎంత‌గా ఆలోచించేదో మాకు తెలుసు. లవ్యూ నాన్నా.. మీ ప్రేమను నేను ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాను' అని మంజుల ఎమోషనల్ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ ఫోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. నాన్న ని త‌లుచుకుంటూ మంజుల పెట్టిన పోస్ట్ ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల హృద‌యాన్ని తాకుతుంది. వాళ్లు కూడా మేము సైతం అంటూ సూప‌ర్ స్టార్ విజ‌యాల్ని స్మ‌రించుకుంటున్నారు.