Begin typing your search above and press return to search.

కల్కిలో కృష్ణుడిగా నటించింది ఇతడే!

కల్కి లాంటి ఎపిక్ సినిమాలో తనకి అవకాశం కల్పించిన నాగ్ అశ్విన్ కి కృష్ణ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 4:18 AM GMT
కల్కిలో కృష్ణుడిగా నటించింది ఇతడే!
X

నాగ్ అశ్విన్ ఎపిక్ క్రియేషన్ కల్కి 2898ఏడీ చూసిన వారికి చాలా సన్నివేశాలు థియేటర్స్ నుంచి బయటకి వచ్చాక కూడా బ్రెయిన్ లో రీక్రియేట్ అవుతూ ఉన్నాయి. అంతాగా కొన్ని సీక్వెన్స్ ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో కురుక్షేత్రం ఎపిసోడ్ కూడా ఒకటి. దీనిని పబ్లిక్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ ఎపిసోడ్ లో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. కర్ణుడిగా ప్రభాస్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ లో కనిపిస్తారు.

ఈ సీన్ లో శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కూడా ఉంటుంది. అయితే ఆ క్యారెక్టర్ పేస్ రివీల్ చేయకుండానే నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రెజెన్స్ ఉండేలా డిజైన్ చేశారు. అందులో యంగ్ లుక్ లో శ్రీకృష్ణుడుగా చేసింది ఎవరా అని ప్రేక్షకులు వెతకడం మొదలుపెట్టారు. అయితే ఆ క్యారెక్టర్ చేసిన నటుడే తన ఐడెంటిటీని రివీల్ చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ లో కల్కిలోని కృష్ణుడి ఇమేజ్ ని షేర్ చేశాడు.

తమిళ్ యాక్టర్ కృష్ణ కుమార్ అలియాస్ కేకే. ఇతను తమిళం లో యాక్టర్ గా, యాక్టింగ్ ట్రైనర్ గా ఉన్నారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. కల్కి లాంటి ఎపిక్ సినిమాలో తనకి అవకాశం కల్పించిన నాగ్ అశ్విన్ కి కృష్ణ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ అవుతోంది. కృష్ణ కుమార్ సూర్య సూరరై పొట్రు సినిమాలో విమానం కెప్టెన్ గా కనిపించాడు. అయితే బలమైన గుర్తుండిపోయే పాత్రలు ఇప్పటి వరకు చేయలేదు.

కల్కి సినిమాలో కృష్ణ కుమార్ లుక్ రివీల్ కాకపోయిన అతని బాడీ లాంగ్వేజ్ తోనే పెర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. అందుకే కృష్ణుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరా అని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. నేచురల్ స్టార్ నాని ఈ పాత్ర చేసాడనే టాక్ వచ్చింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ ని కృష్ణుడి పాత్ర కోసం స్పెషల్ గా విఎఫ్ఎక్స్ తో క్రియేట్ చేశారనే ప్రచారం నడిచింది.

అయితే తమిళ్ యాక్టర్ ని నాగ్ అశ్విన్ కృష్ణుడి పాత్ర కోసం తీసుకున్నాడని ఎవరు గెస్ చేయలేదు. మొత్తానికి ఇప్పుడు రివీల్ అయ్యింది. కల్కి పార్ట్ 2లో కూడా అతని పాత్ర ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఓ సక్సెస్ ఫుల్ మూవీలో భాగమైనందుకు ఈ యంగ్ యాక్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పొచ్చు.