Begin typing your search above and press return to search.

కృష్ణమ్మ ఓటీటీ.. బజ్ మొదలైంది!

సత్యదేవ్ కంచర్ల రీసెంట్ గా నటించిన డిఫరెంట్ మూవీ "కృష్ణమ్మ" ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 May 2024 11:36 AM GMT
కృష్ణమ్మ ఓటీటీ.. బజ్ మొదలైంది!
X

సత్యదేవ్ కంచర్ల రీసెంట్ గా నటించిన డిఫరెంట్ మూవీ "కృష్ణమ్మ" ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ సినిమా పోస్టర్స్ టీజర్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పించారు.

కొరటాల శివ ప్రత్యేకంగా ప్రమోట్ చేసి మరీ సినిమా విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక సత్యదేవ్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలతో గుర్తింపు పొందాడు. "బ్లఫ్ మాస్టర్", "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" వంటి సినిమాలతో తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. ఇక అలాంటి యాక్టర్ నుంచి వచ్చిన కృష్ణమ్మ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ రా మరియు రస్టిక్ యాక్షన్ డ్రామా ఇండియా సహా 240కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. "కృష్ణమ్మ" చిత్రం విజయవాడ పట్నం నేపథ్యంతో సాగుతుంది. ఈ కథలో, కృష్ణ (కృష్ణ), భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల) అనే ముగ్గురు అనాథలు కృష్ణా నది ఒడ్డున పెరుగుతారు. వారి జీవితాల్లో స్నేహం, ప్రేమ, సమస్యలు అన్నీ ఉంటాయి.

శివ అనే పాత్ర చిన్నతనంలో జైలుకు వెళ్లడం, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజాయితీగా జీవించాలనే సంకల్పం చేసుకోవడం ప్రధానంగా ఉంటుంది. కాని, భద్ర మరియు కోటి డబ్బు కోసం గంజాయి స్మగ్లింగ్ చేయాలని భావిస్తారు, అది పోలీసులకు చిక్కడం వారి జీవితాలను పెనుముప్పులోకి నెడుతుంది. వారి ఈ నిర్ణయం వల్ల వారు ఎన్నో అవాంఛనీయ సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల నేపథ్యంలోనే "కృష్ణమ్మ" కథ నడుస్తుంది.

ఈ సినిమా మే నెలలో థియేటర్స్‌లో విడుదలై, ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సత్యదేవ్ తన కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

"కృష్ణమ్మ"లో అతని నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. "కృష్ణమ్మ" కథ, పాత్రల అభినయంతో, రా మరియు రస్టిక్ యాక్షన్ డ్రామా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఇంటి వద్దే ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తుంది. చూస్తుంటే ఇక్కడ సినిమా మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.