Begin typing your search above and press return to search.

దసరా '#కృష్ణారామా'... ఫేస్‌బుక్‌ లాగే ఫేడ్‌ఔట్‌

ప్రతి శుక్రవారం థియేటర్ల ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ ద్వారా కూడా శుక్రవారం వినోదాల విందు అందిస్తున్నారు

By:  Tupaki Desk   |   28 Oct 2023 6:19 AM GMT
దసరా #కృష్ణారామా... ఫేస్‌బుక్‌ లాగే ఫేడ్‌ఔట్‌
X

ప్రతి శుక్రవారం థియేటర్ల ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ ద్వారా కూడా శుక్రవారం వినోదాల విందు అందిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ వారం పలు సినిమాలు సిరీస్ ఓటీటీ ద్వారా లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే గత వారం ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా వచ్చిన #కృష్ణారామా సినిమా గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

సోషల్‌ మీడియా గురించి ఈ సినిమా అంటూ టైటిల్‌ లో హ్యాష్ ట్యాగ్‌ ను పెట్టడం ద్వారా మేకర్స్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆంధ్రాపోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ మాదిరాజు దర్శకత్వంలో ఈ విభిన్న సినిమా రూపొందింది. రాజేంద్ర ప్రసాద్ మరియు గౌతమి లు వృద్ధ దంపతులుగా ఈ సినిమాలో నటించి మెప్పించారు.

రామతీర్థ మరియు కృష్ణవేణి లు ఇద్దరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసి పదవి విరమణ చేసి ఉంటారు. పదవి విరమణ సమయంకు వారి ముగ్గురు పిల్లలు కూడా విదేశాల్లో సెటిల్‌ అవుతారు. దాంతో ఇద్దరు ఒంటరి జీవితం సాగిస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితంలోకి ఫేస్ బుక్ ఎంట్రీ ఇస్తుంది. వారికి ఫేస్ బుక్‌ ను అనన్య మరింతగా ఎక్కిస్తుంది.

ఇద్దరూ కూడా రిటైర్డ్‌ ఉపాద్యాయులు అవ్వడంతో చాలా అనుభవాలు ఫేస్ బుక్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. #కృష్ణారామా పేరుతో మొదలు పెట్టిన ఫేస్ బుక్ పేజ్ కి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ లభిస్తుంది. అంతే కాకుండా వృధ్ద దంపతులు సోషల్‌ మీడియా సెలబ్రెటీలు అవుతారు. అలాంటి సమయంలో వారి మధ్య బేధాభిప్రాయాలు వస్తాయి.

ఒక విషయం గురించి ఇద్దరూ కూడా వేరు వేరు నిర్ణయాలను కలిగి ఉంటారు. ఒకానొక సమయంలో ఇద్దరూ కూడా ఫేస్ బుక్ లైవ్‌ లోకి వచ్చి మరీ ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ ప్రకటిస్తారు. ఆసక్తికర పాయింట్‌ అయినా కూడా దర్శకుడు ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ ప్లేతో సినిమాను నడిపించడంలో విఫలం అయ్యాడు.

ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ కంటే కూడా ఇన్‌ స్టా గ్రామ్‌ కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఫేస్ బుక్ ఫేడ్ ఔట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. #కృష్ణారామా సినిమా కూడా ఫేస్ బుక్ మాదిరిగా కాస్త ఫేడ్‌ ఔట్ స్క్రీన్‌ ప్లే తో సాగినట్లు అనిపిస్తుంది. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఇంకాస్త మెరుగ్గా సినిమా ను రూపొందించి ఉండాల్సింది. ఈటీవీ విన్ కి ఎక్కువ మంది ఖాతాదారులు లేరు అనేది టాక్. మరి ఈ సినిమా ను ఎంత మంది చూశారు.. చూస్తారు అనేది తెలియాల్సి ఉంది.