Begin typing your search above and press return to search.

ఈ స్టార్‌ హీరో చెల్లి గురించి తెలుసా..!

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   24 July 2024 12:30 AM GMT
ఈ స్టార్‌ హీరో చెల్లి గురించి తెలుసా..!
X

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే, తండ్రి నీడ నుంచి చాలా త్వరగానే బయట పడ్డాడు. టైగర్ ష్రాఫ్ నటుడిగా మంచి మార్కులు పొందాడు.


ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు టైగర్‌ ష్రాఫ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. వరుసగా సినిమాలు చేస్తున్న టైగర్‌ ష్రాఫ్‌ కి ఒక చెల్లి ఉంటుంది. ఆమె పేరు కృష్ణ ష్రాఫ్‌. ఈమె గురించి సోషల్‌ మీడియాలో ఉండే వారు అందరికి తెలిసే ఉంటుంది.

ఆమె నెట్టింట అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం కామన్‌ గా చూస్తూనే ఉంటాం. అయితే ఆమెకు సినిమాలపై ఆసక్తి లేదు. మోడలింగ్‌ చేస్తూ, బిజినెస్ లో రాణిస్తున్న కృష్ణ ష్రాఫ్‌ క్రీడా రంగంలో కూడా తన సత్తా చాటేందుకు అప్పుడప్పుడు ప్రయత్నాలు చేయడం మనం సోషల్‌ మీడియా ద్వారా చూడవచ్చు.

సాధారణంగా ఒక స్టార్‌ నటుడి కూతురు లేదా స్టార్‌ హీరో సోదరి ఎక్కువ శాతం ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ కృష్ణ ష్రాఫ్‌ మాత్రం సినిమాలు కాకుండా విభిన్న రంగాల వైపు ఆసక్తి చూపిస్తుంది.

ఇటీవల ఈమె అంతర్జాతీయ స్థాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్‌ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తన వైపు ఆకర్షించింది. ఈ స్థాయిలో హడావుడి చేయడం కేవలం కృష్ణ ష్రాఫ్‌ కి మాత్రమే చెల్లింది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉంటారు.