Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-కృష్ణ మ‌ధ్య వార్ అస‌లు మ్యాట‌ర్ ఇది!

'పండంటి కాపురం 100' డేస్ పంక్ష‌న్ విజ‌య‌వాడ‌లో ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఆంద్రా లో క్రైస‌స్ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   23 May 2024 5:43 AM GMT
ఎన్టీఆర్-కృష్ణ మ‌ధ్య వార్ అస‌లు మ్యాట‌ర్ ఇది!
X

న‌టసార్వాభౌమ‌ ఎన్టీఆర్ - సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ధ్య వివాదాలున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఒకరికొక‌రు పోటీగా సినిమాలు చేసేవేవార‌ని... అభిమానుల మ‌ధ్య వైరం కూడా అప్ప‌ట్లో అలాగే ఉండేద‌ని చాలా కాలంగా విని పిస్తున్న‌దే. కానీ ఆ వివాదానికి కార‌ణాలు ఏంటి అన్న‌ది స‌రైన క్లారిటీ లేదు. మీకు-ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ ఏంటి? అని ఓ ఇంట‌ర్వ్యూలో నేరుగా కృష్ణనే అడిగితే! అస‌లేం జ‌రిగింది? అన్న‌ది రివీల్ చేసారు. ఆ సంగ‌తుల‌న్నీ ఆయ‌న మాట‌ల్లోనే..

'పండంటి కాపురం 100' డేస్ పంక్ష‌న్ విజ‌య‌వాడ‌లో ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఆంద్రా లో క్రైస‌స్ వ‌చ్చింది. అయినా అన్ని సెంట‌ర్ల‌లోనూ 100 రోజులు ఆడిన సినిమా అది. అప్పుడు పీవీ న‌ర‌సింహారావు గారు సీఎంగా ఉన్నారు. జై ఆంధ్రా ఉద్య‌మం మూవ్ మెంట్ కూడా ఉంది. గుంటూరు విజ‌య‌వాడ‌, తెనాలి, రాజ‌మండ్రి, హైద‌రాబాద్ సెంట‌ర్ల‌లో క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్స్ ద్వారా డ‌బ్బులు క‌లెక్ట్ చేసి మావంతు సాయం చేద్దాం అనుకున్నా.

జ‌గ‌య్య రాజ‌మండ్రి, రామారావుగారు బెజ‌వాడ‌, శోభ‌న్ బాబు తెనాలి ఇలా అంద‌ర్నీ పిలిచి ప్రోగ్రామ్ చేసాం.

బెజ‌వాడ‌లో క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్ తో పాటు 100 డేస్ ఈవెంట్ కూడా చేసాం. ఆ ఫంక్ష‌న్ లోనే నా త‌ర్వాతి సినిమా రామారావుగారితో ఉంటుంద‌ని ప్ర‌క‌టించా. దీంతో ఆయ‌న కూడా సంతోషంగా ఫీల‌య్యారు. ఆ త‌ర్వాత ఆయ‌నే ఫోన్ చేసి బ్ర‌ద‌ర్ సినిమా తీస్తాన‌న‌న్నావ్..కాల్షీట్లు ఇస్తాను అన్నారు. ఎప్పుడు మొద‌లు పెడ‌తావ్ అని అడిగారు? అప్పుడు నేను డ్యూయ‌ల్ రోల్ కోసం రాసుకున్న క‌థ ఒక‌టి ఉంది. ఆయ‌న‌తో చేసా. ఆ సినిమా అయిన 'దేవదాసు' నిర్మాత‌ నారాయ‌ణ‌గారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. అప్ప‌టికే ఆయ‌న సీతారామ‌రాజు సినిమా శోభ‌న్ బాబుతో ప్ర‌క‌టించారు.

కానీ ఆ క‌థ‌ని తీసే స్తోమ‌త నాకు లేదు. ఆ క‌థ మీకిచ్చేస్తాను..నాకు వేరే సినిమాకి కాల్షీట్లు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు డైరెక్ట‌ర్ రామ‌చంద్ర‌రావు ని పిలిచి ఆయ‌న తెచ్చిన క‌థ కాదు నేను రీసెర్చ్ చేసి రాస్తాను అని చెప్పాను. అది రెడీ చేసి సీతారామారాజు తీస్తున్నామ‌ని ప్ర‌క‌టించాం. అప్పుడు రామారావు గారు న‌న్ను పిలిచారు. ఏంటి బ్ర‌ద‌ర్ సీతారామ‌రాజు తీస్తున్నావ్ అట క‌దా? ఏంటి అని అడిగారు. ఆంధ్రాలో పాపుల‌ర్ కథ‌ అని ఆయ‌న కూడా అన్నారు. మీరు తీస్తానంటే నేను తీయ‌ను..మీకు ఇచ్చేస్తాను అని అన్నాను.

కానీ నేను తీయ‌ను..నువ్వు తీయెద్దు అన్నారు. దీంతో నేను ఆలోచించుకుని చెబుతా అన్నాను. ఆయ‌న దృష్టిలో ఆ సినిమా హిట్ అవద‌ని భావించారు. స‌న్యాస వ‌స్త్రం...కాషాయం వేసుకుని అడ‌విలో తిరుగుతుంటాడు. పాట ఉండ‌దు? పైట్ ఉండ‌దు? ఆ సినిమా ఎవ‌రు చూస్తారని ఆయ‌నే అన్నారు. న‌వ‌యుగ డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా ఈ సినిమా వద్దు అన్నారు. అప్పుడు 'దేవుడు చేసిన మ‌నుషులు' తార‌క‌రామ డిస్ట్రిబ్యూష‌న్ చేసిన చిత్ర‌మ‌ది.

రామారావు గారు న‌వ‌యుగ లో న‌టించ‌రు. అందుక‌ని తార‌క‌రామ‌కి ఆ సినిమా ఇచ్చాను. అక్క‌డ మాడబ్బు కూడా ఓవ‌ర్ ప్లో ఉంది. పోతే పోయిందిలే అని సినిమా వాళ్ల‌కి ఇచ్చాను. దీంతో రామారావుగారు కోప‌డ్డారు.

ఆకోపంతో 'దేవుడు చేసిన మ‌నుషులు' 100 రోజుల వేడుక‌కు రాలేదు. నాగేశ్వ‌ర‌రావు, శోభ‌న్ బాబు, హేమా మాలిని అంతా చీప్ గెస్ట్ లుగా వ‌చ్చారు. ఈవినింగ్ వ‌ర‌కూ వెయిట్ చేసాం. కానీ నేను రాను పో అన్నారు. అప్ప‌టి నుంచి 10 ఏళ్లు నాతో మాట్లాడ‌లేదు. అప్పుడే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత సీతారామ‌రాజు క‌థ రాయడి మ‌నం తీద్దామ‌ని రామారావు గారు వాళ్ల‌కి చెప్పారు. అన్న‌గారు మీరు కోప‌గించుకోను అంటే ఓ మాట చెబుతాం. మీరు ఒక్క‌సారి కృష్ణ‌గారి తీసిన సీతారామ‌రాజు చూడండి. ఆ త‌ర్వాత కూడా చేస్తానంటే మాకు త‌ప్ప‌దు క‌దా రాస్తాం అన్నారు.

ఆ త‌ర్వాత ఓ స్టూడియోలో రామారావుగారు ఎదుర‌ప‌డ్డారు. మాట్లాడ‌రు క‌దా? త‌ల‌తిప్పుకుని పోతారు క‌దా? అని నేను వెళ్లిపోతున్నాను. అప్పుడే బ్ర‌ద‌ర్ ఇలా రండి అని ఆయ‌నే పిలిచారు. ఏంటండి అని అడిగాను. నీ 'సీతారామారాజు' నేను చూడాలి? నా ప‌క్క‌న కూర్చుని నాకు సినిమా చూపించి అన్నారు. అప్పుడే మా విజ‌య్ కృష్ణ డ‌బ్బింగ్ థియేట‌ర్ ఉండేది. అందులో ప్రోజెక్ష‌న్ వేసి చూపిస్తే ఇంట‌ర్వెల్ కే సినిమా బాగుంద‌న్నారు. ఇంట‌ర్వెల్ అయ్యాక ఇంత‌కంటే గొప్ప‌గా ఎవ‌రూ తీయ‌లేరు. చాలా బాగా తీసావ్ అని ఆప్యాయంగా హ‌త్తుకుని కంగ్రాట్స్ చెప్పారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ని పిలిచి మ‌ళ్లీ మ‌నం తీయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు' అని కృష్ణ ఓ పాత ఇంట‌ర్వ్యూలో చెప్పారు.