Begin typing your search above and press return to search.

కృష్ణ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో లోక‌నాయ‌కుడు

లెజెండరీ న‌టుడు కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే. స్వ‌స్థ‌లంలో ఆయన విగ్రహాన్ని ఇటీవ‌ల‌ ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:25 AM GMT
కృష్ణ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో లోక‌నాయ‌కుడు
X

లెజెండరీ న‌టుడు కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే. స్వ‌స్థ‌లంలో ఆయన విగ్రహాన్ని ఇటీవ‌ల‌ ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ పై సినీ జర్నలిస్టు వినాయకరావు రచించిన కృష్ణ జీవిత చరిత్ర ‘దేవుడు లాంటి మనిషి’ పుస్త‌కాన్ని ఆవిష్కరించారు.

ఇప్పుడు సూప‌ర్ స్టార్ కి విజ‌య‌వాడ‌లో మ‌రో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు దేవినేని అవినాష్ అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో లెజెండ‌రీ కీ.శే.కృష్ణ‌కు హృదయపూర్వక నివాళులు అర్పించారు. #SSKLivesON పేరుతో హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అవుతోంది. లెజెండ‌రీ న‌టుడు కృష్ణ‌ విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హాజ‌రు కావ‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. విగ్ర‌హావిష్క‌ర‌ణ వేళ అభిమానుల కోలాహాలం క‌నిపించింది.

ఆయ‌న లేని లోటు అలానే ఉంది:

14 నవంబర్ 2022న కృష్ణ గుండెపోటుతో బాధపడుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అనంత‌రం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అటుపై ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. 15 నవంబర్ 2022న తన 79వ ఏట ఆయ‌న దివికేగారు. 16 నవంబర్ 2022న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణకు అంత్యక్రియలు జరిగాయి. సూప‌ర్ స్టార్ కృష్ణ తెలుగు సినీపెద్ద‌గా ఎన్నో స‌త్కార్యాలు చేసారు. ఆర్టిస్టుల సంఘం మేలు కోసం పెద్ద‌న్న‌గా నిలిచారు. ఇప్పుడు ఆయ‌న లేని లోటు అలానే ఉంది.

కృష్ణ ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు:

సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు తెలుగు రాష్ట్రాల్లో అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న చేసిన సేవ‌లు ఎన‌లేనివి. ప‌రిశ్ర‌మ‌కు అధునాత‌న సాంకేతిక‌త‌ను ఆరోజుల్లోనే ప‌రిచ‌యం చేసిన ముందు చూపు ఉన్న స్టార్ గా కీర్తినందుకున్నారు. ఒకే రోజు మూడు సినిమాల కోసం మూడు కాల్షీట్లు కేటాయించిన అరుదైన న‌టుడిగాను ఆయ‌న గుర్తింపు పొందారు. ఆస‌క్తిక‌రంగా సూప‌ర్ స్టార్ కృష్ణ వీరాభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నార‌నేది అతి కొద్దిమందికే తెలుసు.

అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవి `ప‌ద్మాల‌య కృష్ణ ఫ్యాన్స్` అసోసియేష‌న్ కి అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. ఆయ‌న‌ను గౌర‌వ అధ్య‌క్షుడు అంటూ సంబోధిస్తూ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ ఒక క‌ర‌ప‌త్రాన్ని ముద్రించింది. నాటి ఆ క‌ర‌ప‌త్రం ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేష‌న్ కి ప్రేమ్ దాస్ అధ్య‌క్షుడు కాగా, న‌టుడు అయిన చిరంజీవిని గౌర‌వ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. నిజానికి అదే క‌ర‌ప‌త్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌- చిరంజీవి క‌లిసి న‌టించిన `తోడు దొంగ‌లు.. అతి త్వ‌ర‌లో వ‌స్తున్నారు` అంటూ టైటిల్ ని కూడా ముద్రించారు. కృష్ణ గారంటే చిరుకి ఎంతో గౌర‌వం అభిమానం. ఇప్ప‌టికీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అంతే గొప్ప సాన్నిహిత్యం ఉంది.

నాటి రోజుల్లో కృష్ణ ఏం చేసినా రెబ‌ల్ గా ఉండేది. టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేయ‌డంలో నిర్మాత‌గా ప్ర‌యోగాలు చేయ‌డంలో.. హీరోగా తెర‌పై రెబ‌ల్ గా క‌నిపించ‌డంలో ఆయ‌న‌ తీరు ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగించేవి.