Begin typing your search above and press return to search.

'అన్నం' వండేది ఎప్పుడంటే..!

సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు, హీరోలు ఎంతో మంది సినిమాలను ప్రకటిస్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   2 Jun 2024 2:30 PM GMT
అన్నం వండేది ఎప్పుడంటే..!
X

సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు, హీరోలు ఎంతో మంది సినిమాలను ప్రకటిస్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని సినిమాలు కనీసం చర్చల దశలకు కూడా వెళ్లవు, కొన్ని సినిమాలు స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అయిన తర్వాత ఆగి పోవడం మనం చూస్తూ ఉంటాం. కొన్ని మాత్రం షూటింగ్‌ దశలో ఆగి పోతాయి.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో ఒకప్పుడు వచ్చిన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా ఎక్కువే అన్నట్లుగా ఉన్నాయి. ఆ రేంజ్‌ లో వంశీ గారి నుంచి ఈ మధ్య కాలంలో సినిమాలు వచ్చాయి.

అయినా కూడా ఆయన అంటే అభిమానం ఉన్న వారు, అప్పటి సినిమాలు చూసి అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా కృష్ణవంశీ గురించి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒక నెటిజన్‌ కృష్ణవంశీ ని ఆసక్తికర ప్రశ్న అడిగాడు.

తన ఫాలోవర్స్ తో చిట్‌ చాట్‌ చేస్తున్న సమయంలో కృష్ణవంశీని ఒక నెటిజన్‌... మీరు 'అన్నం' ఎప్పుడు వండుతారు అంటూ ప్రశ్న వచ్చింది. గతంలో అన్నం అనే సినిమాను కృష్ణవంశీ ప్రకటించాడు. కానీ అది ఇప్పటి వరకు మొదలు పెట్టిన దాఖలాలు లేవు.

నెటిజన్‌ ప్రశ్నకు కృష్ణవంశీ స్పందిస్తూ... అన్నం వండేందుకు సరైన నిర్మాత కావాలంటూ చెప్పుకొచ్చాడు. అంటే అన్నం సినిమా ఇంకా లైన్ లోనే ఉంది, నిర్మాత కోసం వెయిటింగ్‌ అన్నట్లుగా వంశీ గారి సమాధానం ఉంది.

మరో నెటిజన్‌.. మీరు ఒక మంచి ప్రేమ కథను తీయవచ్చుగా అంటూ ప్రశ్నించగా, మంచి ఆలోచన, కథ మీరు రాసి ఇవ్వండి, నేను దర్శకత్వం చేస్తాను అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. మొత్తానికి నెటిజన్స్ తో వంశీ చిట్ చాట్‌ ఆధ్యంతం సరదాగా సాగింది.