Begin typing your search above and press return to search.

ఆయ‌న లేక ఇండ‌స్ట్రీలో అనాథ‌నైపోయాను!

ఆయ‌న సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో బ‌లంగా నాటుకుపోయేవ‌ది.

By:  Tupaki Desk   |   19 May 2024 9:51 AM GMT
ఆయ‌న లేక ఇండ‌స్ట్రీలో అనాథ‌నైపోయాను!
X

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ ఎన్నో హిట్ సినిమాల్ని అందించిన సంగ‌తి తెలిసిందే. 'గులాబీ', 'సింధూరం', 'అంతఃపురం', 'మురారి', ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి బ్లాక్ బస్టర్ లు ఆయ‌న నుంచి వ‌చ్చిన‌వే. ఒక‌ప్పుడు టాలీవుడ్ బాక్సాపీస్ బ్రాండ్ గా వంశీ సినిమాలు మోత మోగించేవి. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆయ‌న సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో బ‌లంగా నాటుకుపోయేవ‌ది.

కానీ కొంత కాలంగా వంశీ సినిమాలు ట్రాక్ త‌ప్పుతున్నాయి. దీంతో హిట్ డైరెక్ట‌ర్ల రేసు నుంచి త‌ప్పుకోవాల్సిన స‌న్నివేశం ఎదురైంది. చివ‌రిగా `రంగమార్తండ` సినిమాని తెర‌కెక్కించారు. ఆ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. మ‌న‌సుకు హ‌త్తుకునే క‌థ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి బాగానే క‌నెక్ట్ అయింది. కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్ అనిపించారు. కానీ త‌దుప‌రి అత‌ని జ‌ర్నీ కంటున్యూ మాత్రం కాలేదు. స‌క్సెస్ వ‌చ్చినా ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు రాలేదు.

న‌ట‌సింహ బాల‌కృష్ణ `రైతు` సినిమాతో అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగిందికానీ ఎందుక‌నో అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఆ త‌ర్వాత బాల‌య్య వేర్వేరు ప్రాజెక్ట్ లు చేసారు గానీ రైతు ని మాత్రం ప‌ట్టాలెక్కించ‌లేదు. అలా కృష్ణంశీ అనే సౌండింగ్ ఇండ‌స్ట్రీలో త‌గ్గిపోయింది. తాజాగా ఓ వేడుక‌లో కృష్ణ‌వంశీ అనాధ‌ను అయిపోయానంటూ క‌న్నీళ్లు చెమ‌ర్చారు. దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులుగా 'నా ఉచ్ఛ్వాసం కవనం' పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో కృష్ణ‌వంశీ ముఖ్య అతిధిగా పాల్గొని శాస్త్రి గారితో ఉన్న జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నారు. `సిరివెన్నెల శాస్త్రి గారితో 1989 నుంచి పరిచయం ఉంది. ఆయన దొరకడం మహా అదృష్టం. ఏ అర్హత లేకపోయినా నన్ను కొడుకుగా స్వీకరించి.. వాళ్ల ఇంట్లోనే ఉండేవాళ్లం. ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కాని.. పాటలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఉప్పుడు ఏసినిమాకి ఎలాంటి పాట‌లుంటాయో తెలిసేది. ఇలాంటి కథ అని అనుకుని ఆయన దగ్గరకు వెళ్లేవాడిని. అలాంటిది ఇవాళ అది లేదు. ఒక రకంగా ఇండస్ట్రీలో అనాథను అయిపోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.