Begin typing your search above and press return to search.

కృష్ణవంశీ పంచ్ ఎవరి మీద..?

చిన్న చిన్న ఎమోషన్స్ కూడా ఆయన బంధించి ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటారు.

By:  Tupaki Desk   |   22 July 2024 6:14 AM GMT
కృష్ణవంశీ పంచ్ ఎవరి మీద..?
X

తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వారిలో కృష్ణ వంశీ ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా సరే అందులో ఒక సిన్సియారిటీ ఉంటుంది. మురారి లాంటి కల్ట్ క్లాస్ సినిమా తీస్తాడు.. సముద్రం, ఖడ్గం లాంటి టిపికల్ సినిమాలను బాగా హ్యాండిల్ చేస్తాడు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన కృష్ణవంశీ ఒకానొక దశలో ఆయన్ను మించి క్రేజ్ తెచ్చుకున్నాడు. కృష్ణవంశీ తీసే ఫ్యామిలీ సినిమాల్లో ఎమోషన్స్ అయితే ఆడియన్స్ హృదయాలకు గుచ్చుకుంటాయి. తీస్తే కృష్ణవంశీలా ఫ్యామిలీ సినిమా తీయాలి అనిపించేస్తాడు. చిన్న చిన్న ఎమోషన్స్ కూడా ఆయన బంధించి ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటారు.

ప్రస్తుతం మహేష్ తో చేసిన మురారి సినిమా రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా మళ్లీ కృష్ణవంశీ యాక్టివ్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో వచ్చిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నారు. ఐతే ఒక అభిమాని ఆయన తీసిన చందమామ సినిమాకు పార్ట్ 2 ఏదైనా ప్లాన్ చేస్తారా అని అడిగితే కృష్ణవంశీ ఇచ్చిన ఆన్సర్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. సీక్వెల్ ఏమి లేదు.. అసలు సీక్వెల్స్ తనకు అర్థం కావు అని ఆన్సర్ ఇచ్చారు కృష్ణవంశీ.

కేవలం తన సినిమా గురించి కృష్ణవంశీ ఈ కామెంట్ పెట్టారని అనుకుంటే పొరపడినట్టే. ఈమధ్య ప్రతి సినిమా సీక్వెల్స్ చేస్తూ రెండు మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. చెప్పాల్సిన కథ.. క్యారెక్టరైజేషన్ ఇలా పెద్దది అవ్వడం చేత కథను పొడిగిస్తున్నారు. ఐతే ఈ సీక్వెల్ కథలు తనకు నచ్చవని చెప్పకనే చెప్పారు కృష్ణవంశీ. అసలు తనకు అలాంటి ఆలోచనే లేదన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

చందమామ విషయంలో అలా అన్నారు సరే.. కానీ మహేష్ సినిమా మురారి సీక్వెల్ కావాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఒకవేళ మహేష్ చేయకపోయినా మురారి 2 లో గౌతం కృష్ణ అయినా చేసే ఛాన్స్ ఉంటుంది. మరి కృష్ణవంశీ ఏమో తనకు సీక్వెల్స్ అర్థం కావు అని ఒక కన్ ఫ్యూజింగ్ ఆన్సర్ ఇచ్చి ప్రేక్షకులను కూడా కన్ ఫ్యూజన్ లో పడేశారు. మరి కేవి ఈ పంచ్ ఎవరి మీదైనా వేశారా లేదా నిజంగానే ఆయనకు సీక్వెల్స్ పై అంత గురి లేదా అన్నది తెలియాల్సి ఉంది. మురారి రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ తన సినిమాలకు సంబంధించిన అన్ని డౌట్లను క్లారిటీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సీనియర్ డైరెక్టర్ చిట్ చాట్ ఆడియన్స్ కు భలే జోష్ అందిస్తుంది.