మురారి ఫ్లాప్ అంటే.. బాక్సాఫీస్ లెక్క చెప్పిన దర్శకుడు
అంతగా కట్టిపడే కథనంతో కృష్ణవంశీ కథలని చెబుతూ ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన మురారీ మూవీ చేశారు.
By: Tupaki Desk | 21 July 2024 6:22 AM GMTక్రియేటివ్ కృష్ణవంశీ కథలు అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అతని సినిమా చూస్తున్నప్పుడు రెగ్యులర్ కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీల్ కలగదు. ఓ కొత్త కథని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది. కృష్ణవంశీ అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. నిన్నే పెళ్ళాడతా, మురారి, ఖడ్గం వంటి సినిమాలని ఈ జెనరేషన్ లో కూడా ప్రేక్షకులు ఇష్టపడతారు. అంతగా కట్టిపడే కథనంతో కృష్ణవంశీ కథలని చెబుతూ ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన మురారీ మూవీ చేశారు.
అయితే ఈ సినిమాపై పబ్లిక్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మూవీ ఫ్లాప్ అనేవారు ఉన్నారు. అలాగే మహేష్ కెరియర్ లో రాజకుమారుడు తర్వాత వచ్చిన సక్సెస్ ఇదే అని నమ్మేవారు ఉన్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాస్త మైథాలజీ టచ్ తో ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇదిలా ఉంటే మురారి సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.
సోషల్ మీడియాలో మురారి సినిమా గురించి ఒక కథనం వైరల్ అయ్యింది. ప్రస్తుతం రెండు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా దర్శకుడికి మాత్రం ప్రశంసలు లభిస్తున్నాయి. మరో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా దర్శకుడు మాత్రం చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు అని కృష్ణవంశీ మురారి, ఆర్జీవీ శివ సినిమాల గురించి రాశారు. దీనిపై కృష్ణవంశీ రియాక్ట్ అయ్యి కౌంటర్ ఇవ్వడం విశేషం.
మురారి సినిమా ఈస్ట్ గోదావరి రైట్స్ ని నేను నిర్మాత నుంచి 5 ఏళ్ళకి 55 లక్షలకి రైట్స్ కొన్నాను. రిలీజ్ తర్వాత ఫస్ట్ రన్ లోనే 1.30 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కలెక్షన్స్ ప్రామాణికంగా తీసుకుంటే నా సినిమా ఫ్లాప్ అయ్యిందా సూపర్ హిట్ గా నిలిచిందా అనేది మీరే డిసైడ్ చేయండి… థాంక్యూ, గాడ్ బ్లెస్ యు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కౌంటర్ నేరుగా మురారి సినిమా ఫ్లాప్ అని కామెంట్స్ చేసిన వారికి తగిలిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మురారి ఫ్లాప్ సినిమా అయితే 175 రోజులు థియేటర్స్ ఆడింది సర్ అంటూ మహేష్ అభిమానులు అప్పటి పోస్టర్స్ షేర్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ లెక్క మీద మీరు మురారి ఫ్లాప్ అని ఎలా చెప్పారో సమాధానం ఇవ్వాలని అడుగుతున్నారు.