Begin typing your search above and press return to search.

బేబమ్మ అప్పుడే అలా అవసరమా?

కృతి శెట్టి ప్రస్తుతం చేస్తున్న తమిళ్‌ సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉండగానే బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఐటెం సాంగ్‌ ఆఫర్‌కి ఓకే చెప్పింది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 1:30 PM GMT
బేబమ్మ అప్పుడే అలా అవసరమా?
X

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు అంతే స్పీడ్‌గా కనిపించకుండా పోయింది. టాలీవుడ్‌లో ఈమెకు ఒక్క ఆఫర్‌ లేదు. కోలీవుడ్‌లో మాత్రం రెండు మూడు సినిమాలు చేస్తోంది. మలయాళంలో ఈ అమ్మడు సినిమాలు చేసింది. ఒకటి రెండు అక్కడ చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్లు రాకున్నా తమిళ్‌, మలయాళంలో ఆఫర్లు ఉన్నాయి. అయినా ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయం షాకింగ్‌గా ఉంది. బాలీవుడ్‌లో ఈ అమ్మడు అడుగు పెట్టేందుకు రెడీ అయ్యింది. అది కూడా ఐటెం సాంగ్‌ తో కావడం ఆశ్చర్యకరమైన విషయం.

కృతి శెట్టి ప్రస్తుతం చేస్తున్న తమిళ్‌ సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉండగానే బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఐటెం సాంగ్‌ ఆఫర్‌కి ఓకే చెప్పింది. త్వరలోనే ఆ హిందీ సినిమా ఐటెం సాంగ్‌లో నటించబోతుంది. కృతి శెట్టి వంటి క్యూట్ ఇమేజ్ ఉన్న ముద్దుగుమ్మలు ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా వచ్చే పాపులారిటీ, క్రేజ్ కంటే డ్యామేజీ ఎక్కువ అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఐటెం సాంగ్స్ చేయాలంటే మాస్‌ బాడీలాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే కృతి శెట్టి ఐటెం సాంగ్‌ చేస్తే ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగులో కృతి శెట్టిని ఐటెం సాంగ్‌లో చూడాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆమెకు ఉప్పెన సినిమాతో తెలుగులో బేబమ్మ అనే క్యూట్ అమ్మాయి ఇమేజ్ దక్కింది. కనుక ఐటెం సాంగ్‌ చేయడం వల్ల ఆమెకు నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. కానీ బాలీవుడ్‌లో కృతి శెట్టి పెద్దగా ఎవరికీ తెలియదు. కనుక అక్కడ సినిమాలో ఐటెం సాంగ్‌ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని ఆమె భావిస్తుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోలు సైతం క్యూట్‌ అండ్‌ క్లీన్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా ఐటెం సాంగ్‌ హీరోయిన్‌ తాలూకు అతి కనిపించదు అనేది కొందరి అభిప్రాయం.

బాలీవుడ్‌లో ఈ అమ్మడు చేయబోతున్న ఐటెం సాంగ్‌ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఒక్క టర్నింగ్‌ పాయింట్‌ కోసం కృతి శెట్టి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ముందు ముందు ఈ అమ్మడి నుంచి వచ్చే సినిమాలు, ప్రత్యేక పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుని తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి. తెలుగులో బేబమ్మ పాత్రలో నటించి మెప్పించడం ద్వారా అదే జోనర్‌లో ఆమెను ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారు. అందుకే కృతి శెట్టి ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్త తెలిసిన వెంటనే ఎక్కువ శాతం మంది అలా అవసరమా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.