Begin typing your search above and press return to search.

బేబమ్మకు అక్కడైనా లైఫ్‌ ఉంటుందా...

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:30 PM GMT
బేబమ్మకు అక్కడైనా లైఫ్‌ ఉంటుందా...
X

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు దక్కించుకోవడంతో పాటు, ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకున్న అరుదైన హీరోయిన్స్‌ జాబితాలో ఈ అమ్మడు చేరింది. బేబమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులు కృతి శెట్టిని నెత్తిన పెట్టుకున్నారు. తక్కువ సమయంలోనే అతి ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడికి దక్కినాయి. మొదటి రెండు మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కృతి శెట్టి సినిమాల ఎంపిక విషయంలో అజాగ్రత్త వహించినట్లుగా ఉంది. అందుకే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌గా మిగిలాయి.

వరుసగా నాలుగు, అయిదు తెలుగు సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు పూర్తిగా తగ్గి పోయాయి. ఒకానొక సమయంలో ఈ అమ్మడు ఇతర భాషల్లో అయినా ఆఫర్లు దక్కించుకునేనా, పూర్తిగా కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లేనా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మలయాళం, తమిళ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. మలయాళంలో ఈ అమ్మడు చేసిన ఏఆర్‌ఎం సినిమా మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేస్తోంది. ఆ మూడు సినిమాలకు మూడు మంచి బజ్ ఉన్న సినిమాలే కావడంతో తమిళనాట ఈమెకు మంచి రోజులు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కోలీవుడ్‌ లో ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల్లో ఒకటి ప్రదీప్‌ రంగనాథ్‌ తో చేస్తున్న ఎల్‌ఐకే కాగా మరోటి జయం రవి హీరోగా నటిస్తున్న సినిమా ఒకటి. ఈ రెండు సినిమాలు మంచి క్రేజీ ప్రాజెక్ట్ లు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా మరో సినిమా సైతం కోలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు సినిమాలకు మూడు హిట్‌ అయితే కచ్చితంగా కృతి శెట్టికి రాబోయే అయిదు సంవత్సరాలు బిజీగా ఉండే విధంగా ఆఫర్లు వస్తాయి. ఒక వేళ మూడు సినిమాలు నిరాశ పరిచితే రాబోయే ఏడాది కాలంలో ఆమెకు ఒకటి రెండు ఆఫర్లు మాత్రమే వస్తాయనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పెన సినిమాలో దర్శకుడు బుచ్చిబాబు బేబమ్మ పాత్రలో కృతి శెట్టిని అద్భుతంగా చూపించడం జరిగింది. ఆ పాత్రను చేయడం వల్ల కృతి శెట్టికి టాలీవుడ్‌ లో స్టార్‌డం దక్కింది. చిన్న వయసులోనే ఆ పాత్ర దక్కడం వల్ల కృతి శెట్టికి టాలీవుడ్‌ లో మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాల విషయంలో ఆమె అజాగ్రత్తగా ఉండటంతో పాటు, కొన్ని ఇతర కారణాల వల్ల టాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గాయి. గత కొన్నాళ్లుగా పూర్తిగా ఆమె సినిమాలు డ్రాప్‌ అయ్యాయి. తమిళ్‌ లో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హిట్‌ అయితే ఏమైనా టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ నుంచి పిలుపు వస్తుందేమో చూడాలి.