Begin typing your search above and press return to search.

కృతి శెట్టి.. ఎలా చేసినా లక్కు రాదే..

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి.

By:  Tupaki Desk   |   15 Sep 2024 5:54 AM GMT
కృతి శెట్టి.. ఎలా చేసినా లక్కు రాదే..
X

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే సూపర్ సక్సెస్ అందుకున్న కృతిశెట్టి తరువాత వరుసగా అవకాశాలు అందుకుంది. నానికి జోడీగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించింది. ఆ మూవీ సక్సెస్ అయ్యింది. ‘బంగార్రాజు’ చిత్రంలో నాగ చైతన్యతో జతకట్టి హిట్ సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ హిట్స్ తో కృతి శెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చింది.

తరువాత వరుసగా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసింది. అలాగే కెరీర్ మొదలు పెట్టి రెండేళ్ళు కాకముందే కోటి రూపాయలుకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అయితే ‘బంగార్రాజు’ తర్వాత కృతిశెట్టి చేసిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. దీంతో తెలుగులో క్రమంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రెమ్యునరేషన్ కూడా తగ్గించాల్సి వచ్చింది. ఆమె చివరిగా ఈ ఏడాది ‘మనమే’ సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటించింది.

ఈ సినిమాతో తెలుగులో బ్రేక్ వస్తుందని కృతిశెట్టి ఆశపడింది. అయితే ఈ సినిమా కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మారింది. దీంతో కృతిశెట్టి మీద టాలీవుడ్ లో ఐరన్ లెగ్ ఇమేజ్ పడిపోయిందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మలయాళంలో టోవినో థామస్ కి జోడీగా చేసిన ‘అజాయంతే రందం మోషణం’ మూవీలో కృతిశెట్టి నటించింది.

ఈ సినిమా మలయాళీలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే తెలుగు నేటివిటీకి ఈ మూవీ కథ సింక్ కాలేదు. దీంతో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. ఈ మూవీ తెలుగులో సక్సెస్ అయితే మరల అవకాశాలు వస్తాయని కృతి శెట్టి భావించిన నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో కార్తీకి జోడీగా ‘వావాతియార్’ సినిమాలో నటించింది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ కి జోడీగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే మూవీలో చేస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది కూడా తెలుగులో రిలీజ్ కానుంది.

అలాగే జయం రవికి జోడీగా ‘జెనీ’ అనే చిత్రం చేస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే మరల తన ఫేట్ మారుతుందని కృతి శెట్టి భావిస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే తమిళంలో అయితే ఇమేజ్ పెరగడం గ్యారెంటీ. కానీ తెలుగులో ఏ మేరకు ఛాన్స్ లు దక్కించుకుంటుందనేది వేచి చూడాలి.