పింక్ లో ఉప్పెన పాప.. సొగసు చూడతరమా
డ్రెస్‌లో కృతి, సాంప్రదాయాన్ని, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను కలగలిపి సరికొత్తగా కనిపించింది.
By: Tupaki Desk | 8 Nov 2024 11:30 PM GMTటాలీవుడ్ గ్లామరస్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ఈమధ్య కాస్త స్లో అయ్యింది. మొదట్లో వరుసపెట్టి అవకాశాలు అందుకున్న అమ్మడు ఒక్కసారి రెమ్యునరేషన్ ను కోటి దాటించేసింది. ఇక ఎవరికి అందనంత ఎత్తులో వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడు ఆ తరువాత వరుస డిజాస్టర్స్ తో ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఇక సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా తన గ్లామర్, మాడర్న్ స్టైల్‌తో యూత్‌ని ఎంతగానో ఆకర్షిస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలోని ఇతర కథానాయికల కంటే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ అందాల రాశి, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ డ్రెస్స్‌లో మెరిసిపోతూ కొన్ని స్టైలిష్ ఫోటోలను పోస్ట్ చేసింది. కృతి తన డ్రెస్సింగ్ స్టైల్ లో ప్రతి చిన్న డీటైల్‌ని బాగా హైలైట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పింక్ అవుట్‌ఫిట్‌లో ఉన్న కృతి ఫోటోలు చూస్తుంటే ఒక వైపు ఆమె సాఫ్ట్‌నెస్‌ను హైలైట్ చేస్తూనే, మరొక వైపు ఆమె ఫ్యాషన్ సెన్స్‌కి సంబంధించిన లోతైన అనుభవాన్ని తెలియజేస్తున్నాయి.
ఈ డ్రెస్‌లో కృతి, సాంప్రదాయాన్ని, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను కలగలిపి సరికొత్తగా కనిపించింది. ఈ డ్రెస్సింగ్‌తో ఆమె తనను తాను ఫ్యాషన్ ఐకాన్‌గా నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు కేవలం అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుతోంది. కృతికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ నుండి ఈ పిక్స్ కు అమితమైన స్పందన లభించింది.
ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ఉప్పెన సినిమాతో సాలీడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి ఆ తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాలతో వరుస హిట్స్ సొంతం చేసుకుంది. ఇక వాటి తరువాత ఆమె చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మనమే సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో కూడా ఆమె మీడియం రేంజ్ హీరోతో ఛాన్స్ అందుకున్నట్లు టాక్.