Begin typing your search above and press return to search.

బేబమ్మ ఆశలన్నీ అక్కడే..!

వరుస యువ హీరోలందరితో కలిసి సినిమాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్టు లేక కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి.

By:  Tupaki Desk   |   24 Oct 2024 1:30 AM GMT
బేబమ్మ ఆశలన్నీ అక్కడే..!
X

ఉప్పెన లాంటి 100 కోట్ల హిట్ అందుకున్న తర్వాత ఆ సినిమాతో పరిచయమైన హీరోయిన్ గా బేబమ్మ అలియాస్ కృతి శెట్టికి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే వరుస ఛాన్స్ లు కూడా అందుకుంది. ఐతే కృతి శెట్టి లక్ మాత్రం రివర్స్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ కూడా ఆమెను నిరాశ పరచేలా చేశాయి. దాంతో ఎలా అయితే ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్లి అందరి మధ్య చర్చగా మారిందో అంతే త్వరగా ఫాం కోల్పోయింది. వరుస యువ హీరోలందరితో కలిసి సినిమాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్టు లేక కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి.

ఇక ఇప్పుడు అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు కూడా లేదని పక్కనే ఉన్న కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. జయం రవితో ఒక సినిమా ఆఫర్ అందుకున్న కృతి శెట్టి ప్రదీప్ రంగనాథ్ తో LIK సినిమా ఛాన్స్ కూడా అందుకుంది. ఈ రెండు సినిమాలతో తమిళ్ లో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు. ఐతే సినిమాలతో పాటు ఈమధ్య ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు ఎట్రాక్ట్ చేస్తుంది. ఈమధ్య స్లీవ్ లెస్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని బుట్టలో పడేస్తుంది.

తెలుగు సినిమా తొలి ఆఫర్ ఇచ్చి 100 కోట్ల సినిమా ఇచ్చినా కథల ఎంపికలో తెలివిని ప్రదర్శించలేని అమ్మడు త్వరగానే తన ఫాం కోల్పోయేలా చేసుకుంది. ఐతే టాలీవుడ్ పక్కన పెట్టి ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా కోలీవుడ్ మీద పెట్టింది బేబమ్మ. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుండగా ఒక్క హిట్ పడినా సరే తన మకాం ని తమిళ పరిశ్రమకు మార్చాలని చూస్తుంది అమ్మడు.

ఈమధ్యనే మలయాళంలో కూడా టోవినో థామస్ తో ఒక సినిమా చేసింది కృతి శెట్టి. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు పెట్టుకోగా మలయాళంలో సోసోగా ఆడిన ఆ మూవీని తెలుగు, తమిళ ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. మరి తెలుగు లో ఎలాగు ఛాన్సులు లేవని తమిళ, మలయాళంలో గట్టి ప్రయత్నాలు చేస్తున్న కృతి శెట్టికి అక్కడైనా సరైన ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.