బేబమ్మపై బుచ్చిబాబు ప్రేమ చూపిస్తాడా..?
ఉప్పెన తర్వాత బుచ్చి బాబు మాత్రం తన రెండో సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా వస్తుంది.
By: Tupaki Desk | 16 March 2025 5:00 AM ISTఉప్పెన సినిమాతో ఒకేసారి దర్శకుడు, హీరో, హీరోయిన్ ముగ్గురు కొత్త వాళ్లు పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన డైరెక్టర్ గా బుచ్చి బాబు సెన్సేషనల్ రికార్డ్ అందుకోగా మెగా మేనల్లుడిగా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక అదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కూడా అదరగొట్టేసింది. ఐతే ఉప్పెన తర్వాత హీరో, హీరోయిన్ వరుస సినిమాలు చేసి ఫెయిల్యూస్ చవిచూశారు.
ఉప్పెన తర్వాత బుచ్చి బాబు మాత్రం తన రెండో సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా షూటింగ్ నుంచి వస్తున్న అప్డేట్స్ తోనే మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఐతే ఈ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ గా జాన్వి కపూర్ లాక్ అయ్యింది. బుచ్చి బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా రాసుకున్నాడని టాక్.
ఆ ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్స్ క్యూలో ఉన్నారు. ఐతే ఉప్పెనతో తనకు తొలి హిట్ ఇచ్చిన కృతి శెట్టినే ఆ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంది. ఉప్పెన తర్వాత కృతి శెట్టి అరడజను పైగా సినిమాలు చేసింది. వాటిలో ఏ ఒక్కటి అమ్మడికి క్రేజ్ తీసుకు రాలేదు. ఐతే మళ్లీ బుచ్చి బాబు ద్వారానే అమ్మడు బ్యాక్ టు ఫాం అవ్వాలని చూస్తుంది. ఐతే ఉప్పెన బేబమ్మ మీద బుచ్చి బాబు ప్రేమ చూపిస్తాడా లేదా అన్నది డౌట్ గా ఉంది.
బుచ్చి బాబు మాత్రం తను రాసుకున్న పాత్రకు ఎవరు బెస్ట్ అనిపిస్తారో వాళ్లనే తీసుకోవాలని చూస్తున్నాడు. RC 16 సినిమా విషయంలో డైరెక్టర్ అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. మరి ఉప్పెన హీరోయిన్ కూడా బుచ్చి బాబు సెకండ్ సినిమాలో రిపీట్ అవుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. ఐతే కెరీర్ అటు ఇటుగా ఉన్న ఈ టైం లో చరణ్ సినిమా ఛాన్స్ వస్తే మాత్రం కృతి శెట్టి ఫేట్ మారినట్టే లెక్క. ముఖ్యంగా అమ్మడికి ఈ ఛాన్స్ కచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకునేలా చేస్తుందని చెప్పొచ్చు. ఎలాగు ఉప్పెన సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి RC 16లో కృతి ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.