'ఉప్పెన' భామ అక్కడ వెరీ బిజీ!
మకాం హైదరాబాద్ నుంచి చెన్నైకి మార్చేసి అక్కడ సినిమాలు సినిమాలు చేయడం మొదలు పెట్టింది.
By: Tupaki Desk | 6 Nov 2024 1:30 AM GMT'ఉప్పెన' విజయంతో టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది ముంబై బ్యూటీ కృతిశెట్టి. అందం, అభినయం తో ఆ తర్వాత అవకాశాలు బాగానే అందుకుంది. నటిగానూ అమ్మడు మంచి మార్కులే వేయించుకుంది. కానీ సొగసరిని వైఫల్యాలు వెనక్కి నెట్టాయి .దీంతో కోలీవుడ్ పై మనసు మళ్లించింది. మకాం హైదరాబాద్ నుంచి చెన్నైకి మార్చేసి అక్కడ సినిమాలు సినిమాలు చేయడం మొదలు పెట్టింది. పనిలో పనిగా మలయాళం చిత్రాలపైనా ఫోకస్ పెట్టింది.
దీంతో ఒకేసారి రెండు భాషల్లోనూ అవకాశాలు రావడం మొదలైంది. మలయాళంలో టోవినో థామస్ తో నటించిన 'ARM' ఈ ఏడాది అక్కడి బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పుడు మలయాళం నుంచి ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందిరితోనూ అవకాశాలు అందుకుంటుంది.
అక్కడ వంద కోట్ల సినిమా అంటే? చాలా రేర్ గా ఉంటుంది. అలాంటి ప్రాజెక్ట్ లో కృతిశెట్టి భాగమవ్వడంతో అక్కడి స్టార్ హీరోలకు సెంటిమెంట్ గానూ మారిపోతుంది. ఈ నేపథ్యంలో అవకాశాలు జోరందుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆమె కోలీవుడ్ లోను బిజీ అవుతోంది. తమిళంలో కార్తీ .. జయం రవి .. ప్రదీప్ రంగనాథన్ జోడీగా ఆమె చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ సక్సస్ లతో అమ్మడు మళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పాత పరి చయాల్ని తిరగతోడుతోందిట. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. కానీ వీటిలో ఓ రెండు..మూడు సినిమాలు తప్ప మిగిలినవి ఆశించి ఫలితాలు సాధించలేదు.