కృతి శెట్టి వాలెంటైన్ వైబ్స్.. పొట్టి గౌనులో ఇలా..
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృతి, తెలుగుతో పాటు తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టింది.
By: Tupaki Desk | 13 Feb 2025 3:25 PM GMTక్యూట్ హీరోయిన్ కృతి శెట్టి, ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో సాలీడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి తన లుక్స్‌తో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్, ది వారియర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గరైంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృతి, తెలుగుతో పాటు తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టింది.
అయితే, వరుసగా వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించకపోవడం ఆమెకు కాస్త నిరాశని కలిగించింది. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కృతి, ఇలాంటి స్లో ఫేజ్‌లో కూడా సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫోటోషూట్స్‌తో హవా చూపిస్తుంది. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తుంది.
తాజాగా కృతి వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వైట్ ఫ్లోరల్ గౌన్‌లో ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ స్టిల్స్‌లో ఆమె గ్లామర్ టచ్‌తో క్యూట్ లుక్స్ కనబరిచింది. పచ్చని పువ్వుల బొకే పట్టుకుని, స్వీట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫోజులిచ్చింది. ముఖ్యంగా ఆమె చిరునవ్వు, సింపుల్ మెక్అప్ తో నేచురల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. “వాలెంటైన్స్ డే లేదా గాలెంటైన్స్ డే – మీరు ఏది సెలబ్రేట్ చేస్తున్నారు?” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌కి ఫ్యాన్స్ నుంచి రిప్లైలు వెల్లువలా వచ్చాయి.
కృతి సినిమాల్లో ప్రస్తుతం కాస్త స్లోగానే ఉన్నా, సౌత్‌లో కొన్ని ప్రాజెక్ట్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఒక బిగ్ హీరోతో నటించే అవకాశం ఉందని టాక్. అలాగే టాలీవుడ్‌లో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం కూడా ఆమెను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కృతి, తన నెక్స్ట్ మూవీస్‌తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఫోటోషూట్‌తో కృతి మరోసారి ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మరీ ఈ అందంతో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.