టోన్డ్ లెగ్స్ రెడ్ హాట్ లుక్ తో కిల్లర్ బ్యూటీ
ఈ ఫోటోలలో ముదురు ఎరుపు రంగు హాల్టర్ టాప్ మినీ దుస్తులలో ఎంతో అందంగా కనిపించింది. డిజైనర్ లుక్ కి తగ్గట్టుగానే, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్ తో కిల్ చేసింది.
By: Tupaki Desk | 20 Sep 2023 3:25 PM GMTఅందానికి అందం ప్రతిభతో యువతరం దృష్టిని ఆకర్షించింది కృతిశెట్టి. కన్నడ రంగం నుంచి వచ్చి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ పలు భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఆశించిన విజయాలు దక్కకపోయినా అవకాశాలకు అయితే కొదవేమీ లేదు. ఇక పరిశ్రమలో కేవలం నాలుగైదేళ్లలో సాధించింది కొంతే. అందుకే ఇప్పుడు తన కెరీర్ పరిధిని మరింతగా విస్తరించేందుకు, తనను తాను మెరుగులు దిద్దుకునేందుకు ఈ భామ ప్రయత్నిస్తోందట.
ఇంతలోనే మరో ఏడాది పెద్దదైపోయింది. 21 సెప్టెంబర్ 2023..నాటికి కృతి శెట్టికి 19 ఏళ్లు నిండుతాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తన అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసింది ఇలా. ఈ ఫోటోలలో ముదురు ఎరుపు రంగు హాల్టర్ టాప్ మినీ దుస్తులలో ఎంతో అందంగా కనిపించింది. డిజైనర్ లుక్ కి తగ్గట్టుగానే, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్ తో కిల్ చేసింది. ఇది కృతి అద్భుతమైన రూపానికి అదనపు ఆకర్షణను పెంచింది. కృతి ఎంతో ఇదిగా టోన్డ్ లెగ్స్ సౌందర్యాన్ని ప్రదర్శించింది.
ఈ స్పెషల్ లుక్ తో పాటు, కృతి శెట్టి ఒక అందమైన సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది."నేను భూమిపై మరొక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను. ఇదంతా కృతజ్ఞత మాత్రమే… నేను కలిగి ఉన్నదంతా, నా కోసం నేను చేసినదంతా, నాకు ఇచ్చినదంతా... ఆనందం, ప్రేమ, ద్వేషం, బాధ... ఇవే నన్ను ఈ రోజు నన్ను నేనుగా మలిచినవి.. దీనికి చాలా కృతజ్ఞతలు... నా గొప్ప ప్రేరణ నా కుటుంబం..మీ అందరికీ కృతజ్ఞతలు... అడుగడుగునా నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు" అని రాసింది. ఈ కొద్దిపాటి ప్రయాణంలో తనతో ఉన్న కుటుంబం, మద్ధతుదారులకు తనదైన శైలిలో కృతి ధన్యవాదాలు తెలిపింది. బర్త్ డే బేబి కెరీర్ లో ఆశించిన పెద్ద విజయాలు దక్కాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు.