Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ బోల్డ్ అటెంప్ట్ కి రెడీ.. అవకాశాలే రావట్లేదు..!

ఈ క్రమంలో మొన్నటిదాకా గ్లామర్ విషయంలో కాస్త మొహమాట పడిన అమ్మడు ఇప్పుడు స్కిన్ షోకి డబుల్ ఓకే అనేస్తుంది

By:  Tupaki Desk   |   14 Feb 2024 11:30 PM GMT
ఆ హీరోయిన్ బోల్డ్ అటెంప్ట్ కి రెడీ.. అవకాశాలే రావట్లేదు..!
X

ఉప్పెనతో హిట్ కొట్టి ఆ తర్వాత సూపర్ స్పీడ్ లో అరడజను పైగా సినిమాలు చేసిన కృతి శెట్టి ఎలా ఫాం లోకి వచ్చిందో అలా కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది. హిట్ పడినప్పుడు ఆఫర్లు వద్దన్నా వస్తాయి.. ఫ్లాపులు వస్తుంటే ఆఫర్లు అడుగుతున్నా దూరమవుతాయి. ప్రస్తుతం కృతి శెట్టి ఈ స్టేజ్ లోనే ఉంది. అందుకే ఇక కెరీర్ విషయంలో టాప్ గేర్ వేయాల్సిందే అని ఫిక్స్ అయ్యింది అమ్మడు. ఈ క్రమంలో మొన్నటిదాకా గ్లామర్ విషయంలో కాస్త మొహమాట పడిన అమ్మడు ఇప్పుడు స్కిన్ షోకి డబుల్ ఓకే అనేస్తుంది.

అందుకు హింట్ ఇస్తూనే రెగ్యులర్ గా ఫోటో షూట్ చేస్తూ అలరిస్తుంది కృతి శెట్టి. అంతేకాదు ఈమధ్య తన ఫోటో షూట్స్ తో గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హీరోయిన్ గా కెరీర్ కొన్నాళ్లు కొనసాగించాలంటే ఆడియన్స్ ని గ్లామర్ తో బుట్టలో పడేయాలన్న విషయాన్ని లేట్ గా అర్ధం చేసుకున్న కృతి శెట్టి రీసెంట్ ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.

అంతేకాదు ఈమధ్య బెల్లీ డ్యాన్స్ వీడియో షేర్ చేసి ఫాలోవర్స్ ని మరింత డిస్టర్బ్ చేస్తుంది బేబమ్మ. ఇదిలా ఉంటే అంతకుముందు బోల్డ్ అటెంప్ట్ అంటే దూరంగా ఉన్న అమ్మడు ఇక మీదట అలాంటి సినిమాలు కూడా చేసేందుకు రెడీ అంటుంది. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్, బోల్డ్ సీన్స్ లో కూడా నటించేందుకు సై అనేస్తుంది. స్టార్ సినిమాల్లో మంచి రోల్ ఉన్న హీరోయిన్ పాత్ర దక్కడం చాలా అరుదు. కానీ అదే స్టార్ సినిమాల్లో ఇచ్చిన పాత్రలో గ్లామర్ సైడ్ అదరగొట్టేస్తే మాత్రం హీరోయిన్స్ కి మంచి మైలేజ్ వస్తుంది.

ఈ లాజిక్ ని కాస్త లేట్ గా కనిపెట్టిన కృతి శెట్టి ఇక మీదట ఎలాంటి సినిమా అయినా ఓకే అనేస్తుంది. అంతేకాదు కృతి శెట్టి ఈ కథలు మాత్రమే చేస్తుంది.. ఈ హీరోలతో మాత్రమే నటిస్తుంది అన్నట్టు కాకుండా ఎలాంటి సినిమాలైనా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మరి ఇంత కష్టపడుతున్న బేబమ్మ కెరీర్ లో తిరిగి ఫాం లోకి వస్తే బెటర్ అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో శర్వానంద్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. తమిళ, మలయాళ భాషల్లో చెరో సినిమా చేస్తుంది.