Begin typing your search above and press return to search.

బేబమ్మ అక్కడ ఫోకస్ చేస్తే బెటరేమో..?

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడికి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది

By:  Tupaki Desk   |   12 Jun 2024 6:08 AM GMT
బేబమ్మ అక్కడ ఫోకస్ చేస్తే బెటరేమో..?
X

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడికి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో అమ్మడు వరుస సినిమా ఆఫర్లు అందుకుంది. ఉప్పెన తర్వాత దాదాపు అరడజనకి పైగా ఛాన్సులు అందుకున్న కృతి శెట్టి అలా చేసిన సినిమాల వల్ల పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఒక్క హిట్టు పడితే మళ్లీ కెరీర్ తిరిగి గాడిలో పడేసుకోవాలని చూస్తున్న కృతి శెట్టికి చివరగా శర్వానంద్ మనమే ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ తో కృతి శెట్టికి కలిసి వస్తుందని అనుకోగా అది కూడా అంతగా వర్క్ అవుట్ అయినట్టు లేదని తెలుస్తుని.

శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. ఈ సినిమా ఫలితం శర్వానంద్ ఫ్యాన్స్ ని ఖుషి చేసినా బేబమ్మ లవర్స్ కి మాత్రం నిరాశ మిగిల్చింది. సినిమాలో కృతి శెట్టికి మంచి పర్ఫార్మెన్స్ పాత్ర ఇచ్చినా అమ్మడు కూడా తన ఎఫర్ట్ పెట్టినా జస్ట్ ఓకే అనిపించింది. ఐతే తెలుగులో కెరీర్ మంచి స్టార్టింగ్ దొరికినా ప్రస్తుతం కృతి శెట్టికి తెలుగు ఆఫర్లు కరువయ్యాయి.

ఈ టైం లో కృతి శెట్టికి ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ తమిళంలో జయం రవి హీరోగా జినీ సినిమా చేస్తున్న కృతి శెట్టి ఆ తర్వాత మరో సినిమా ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది. ఇక మరోపక్క మలయాళంలో కూడా అమ్మడు లక్కీ ఆఫర్ కొట్టేసింది. తెలుగులో మంచి స్టార్టింగ్ దొరికినా ఆ తర్వాత తన రేంజ్ హిట్ అందుకోలేకపోతున్న కృతి శెట్టి ఎక్కడ అవకాశాలు వస్తున్నాయో అక్కడ ఫోకస్ చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉంది.

తనకు అవకాశాలు రాని చోట ప్రయత్నించడం కన్నా ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న చోట ప్రయత్నిస్తే బెటర్ అని అనుకుంటుంది. కృతి శెట్టికి తమిళంలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. వాటి వల్ల అమ్మడికి కెరీర్ మీద మళ్లీ ఆశలు చిగురించాయి. తనను కావాలనుకుంటున్న కోలీవుడ్ లో వరుస సినిమాలు చేయాలని చూస్తుంది కృతి శెట్టి. మరి బేబమ్మకి అక్కడ అయినా అవకాశాలు వస్తాయా రావా అన్నది చూడాలి.