హోళీ దెబ్బకి గోళీలేసుకున్న హీరోయిన్!
ఉదయం నుంచి అంతా హోళీ సంబరంలో మునిగి తేలుతున్నారు. ముఖాలకు రంగులు పూసుకుని ఒకరి సంతోషం ఒకరు పంచుకుంటున్నారు.
By: Tupaki Desk | 25 March 2024 12:30 PM GMTఉదయం నుంచి అంతా హోళీ సంబరంలో మునిగి తేలుతున్నారు. ముఖాలకు రంగులు పూసుకుని ఒకరి సంతోషం ఒకరు పంచుకుంటున్నారు. ఇంద్రధనుస్సులోని రంగుల్లా జీవితం వెలిగిపోవాలని విషెస్ తెలియ జేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా విషెస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. మిడ్ నైట్ నుంచే వార్ మొదలైంది. ఇక ఈ పండుగను సెలబ్రిటీలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఎక్కడున్నా రంగుల వల్లీని మాత్రం మిస్ అవ్వని భామా మణులు చాలా మంది ఉన్నారు.
అయితే ఈ బ్యూటీ విషయంలో మాత్రం హోళీ అంటే గోళీలు వేసుకున్న రోజులే గుర్తొస్తాయి. ఆమె ఎవరో కాదు అందాల యువ హీరోయిన్ కృతిశెట్టి. ఆ ముచ్చటేంటో ఆమె మాటల్లోనే..`హోలీతో నాకు బోలెడు తీపి అనుభవాలతో పాటు ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా... మా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పిల్లలందరం కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చి సబ్బు తో ఎంత రుద్దినా సరే కలర్స్ వదల్లేదు. దాదాపు 20 రోజులదాకా ఆ రంగులు నా ఒంటి మీద అలాగే ఉండిపోయాయి.
క్రమంగా చర్మంపై దురద, దద్దుర్లు రావడం మొదలయ్యాయి. అవి పెరగడం ఎక్కువైంది. శరీరం రంగు మారిపోతుంది. దాంతో నాకు రంగులంటే అలర్జీ అని గ్రహించి అప్పటి నుంచి హోలీ ఆడడం మానేశాను. అయితే స్నేహితులతో కలిసి రెయిన్ డ్యాన్స్‌లో మాత్రం పాల్గొంటా. హోలీ ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చేవి... కాజూ కట్లీ.. చాక్లెట్ కేక్. ఈరోజు మాత్రం వాటిని అస్సలు మిస్ కాను. ఇంట్లో తినొద్దని చెప్పినా వాళ్ల మాట వినను. నాన్న కూడా ఉంటున్నా! దొంగ చాటుగా వాటిని లాగించేస్తాను` అని అంది.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే గతేడాది ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. కానీ న్యూ ఇయర్ లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంది. తెలుగు ఛాన్సులు లేకపోయినా పరభాష తమిళ్ లో బాగానే సినిమాలు చేస్తోంది. మూడు -నాలుగు సినిమాలు చేస్తోంది. ఆశలు కూడా వాటిపైనే పెట్టుకుంది. విజయాలతో కంబ్యాక్ అవ్వాలని చూస్తుంది.