Begin typing your search above and press return to search.

బేబమ్మ ఆశలు బాగానే ఉన్నాయి..!

ప్రస్తుతం శర్వానంద్ తో మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కృతి శెట్టి ఆ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది.

By:  Tupaki Desk   |   2 Jun 2024 9:34 AM GMT
బేబమ్మ ఆశలు బాగానే ఉన్నాయి..!
X

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అదిరిపోయే స్టార్టింగ్ దొరికినా ఆ తర్వాత సినిమాల వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది బేబమ్మ కృతి శెట్టి. ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టిన అమ్మడు ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోవడం కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. చేయడానికి అరడజనుకు పైగా సినిమాలు చేసినా అవేవి ఆమె రేంజ్ పెంచకపోగా కాస్త కూస్తో ఉన్న పాపులారిటీని కూడా తగ్గించేలా చేశాయి. అందుకే ఇక మీదట కెరీర్ లో ఆచి తూచి అడుగులేయాలని అనుకుంటుంది కృతి శెట్టి. ప్రస్తుతం శర్వానంద్ తో మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కృతి శెట్టి ఆ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది.

సినిమాలో తన పాత్ర తన రెగ్యులర్ పాత్రకు భిన్నంగా ఉందని అంటుంది కృతి శెట్టి. మనమే సినిమాలో తాను చేసిన సుభద్ర పాత్ర ప్రతి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎక్కువగా అవతల వ్యక్తులను అరుస్తుంది. కానీ బయట తాను అలా ఉండలేనని అంటుంది బేబమ్మ. పర్సనల్ లైఫ్ లో తను చాలా సైలెంట్ గా ఉంటానని.. అసలు అరవడం వల్ల కాదని అన్నది కృతి శెట్టి. కేవలం ఈ పాత్ర కోసమే కాస్త ట్రైన్ అయ్యి అరిచేశానని అంటుంది అమ్మడు.

ఇక కెరీర్ స్ట్రాంగ్ చేసుకునేందుకు కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలని అనుకుంటున్నానని చెప్పిన కృతి శెట్టి అనుష్క లాగా తనకు డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉందని అంటుంది. అంతేకాదు మహారాణి పాత్రల్లో చేయాలని తనకు కోరికగా ఉందని చెబుతుంది కృతి శెట్టి. ఉప్పెన సినిమా చూశాక 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవిలా లేలేత అందాలతో సిల్వర్ స్క్రీన్ పై కొన్నాళ్లు వెలిగిపోతుందని అనిపించింది కృతి శెట్టి.

ఐతే తనకు స్ట్రాంగ్ గా అనిపించిన పాత్రలు చేస్తూ కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాల్సిందిపోయి తన దాకా వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వచ్చింది. అందుకే అమ్మడికి కాస్త కెరీర్ గ్యాప్ ఏర్పడింది. ఐతే తమిళంలో 3 సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తుండటం వల్లే తనకు తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చిందని అంటుంది కృతి శెట్టి. మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కృతి శెట్టి మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ కొడుతుందా లేదా అన్నది చూడాలి.