Begin typing your search above and press return to search.

బేబమ్మ తక్షణ కర్తవ్యం ఏంటి..?

ఈమధ్యనే శర్వానంద్ తో మనమే అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించిన కృతి శెట్టి ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించింది.

By:  Tupaki Desk   |   11 July 2024 6:21 AM GMT
బేబమ్మ తక్షణ కర్తవ్యం ఏంటి..?
X

తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన హీరోయిన్ గా కృతి శెట్టి తన బ్యాడ్ లక్ కొనసాగిస్తుంది. ఉప్పెనతో తెలుగు తెర మీద కొత్త అందంగా అదరగొట్టిన అమ్మడు ఆ సినిమాలో బేబమ్మ పాత్ర ఆమె కోసమే అన్నట్టుగా చేసింది. ఐతే ఆ తర్వాత సినిమాల్లో అమ్మడు ఎందుకో అంత ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో చేయడానికి ఎనిమిది సినిమాలు చేసినా ఉప్పెన తర్వాత అమ్మడికి పేరు తెచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు.


ఈమధ్యనే శర్వానంద్ తో మనమే అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించిన కృతి శెట్టి ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించింది. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది కృతి శెట్టి. ఐతే తెలుగులో అమ్మడు ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నా బేబమ్మని మాత్రం ఎవరు లెక్క చేయట్లేదని తెలుస్తుంది. తన క్యూట్ యాక్టింగ్ తో కెరీర్ మొదట్లోనే కుర్రాళ్లను వల్లో వేసుకున్న కృతి ఇప్పుడు అసలు అవకాశాలు లేని విధంగా పరిస్థితి తయారు చేసుకుంది.

ఐతే తెలుగులో ఎలాగు వర్క్ అవుట్ అయ్యేలా లేదని చిన్నగా కోలీవుడ్ జంప్ అయ్యింది చిన్నది. అక్కడ ఆల్రెడీ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో సినిమా చర్చల్లో ఉందట. మలయాళంలో కూడా అక్కడ క్రేజీ హీరో టోవినో థామస్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ పట్టేసింది కృతి శెట్టి. సో చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా అక్కడ కృతి సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

ఐతే ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తన సెకండ్ సినిమా చరణ్ తో చేస్తున్నాడు. ఉప్పెన సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ చరణ్ సినిమాలో కృతికి ఛాన్స్ ఇస్తే మాత్రం అమ్మడికి మళ్లీ టాలీవుడ్ లో హోప్ మొదలైనట్టే లెక్క. ఐతే ఆల్రెడీ చరణ్ బుచ్చి బాబు సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి కృతి శెట్టికి ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా తెలుగులో మరో మంచి అవకాశం కోసం కృతి ఈగర్ గా వెయిట్ చేస్తుంది. సినిమా ఛాన్సుల కోసమే ఈమధ్య అమ్మడు ఫోటో షూట్స్ లో కూడా గ్లామర్ డోస్ పెంచుతుంది. ఉప్పెన సినిమాలో బేబమ్మ కూడా బోల్డ్ గా కనిపించేందుకు రెడీ అని హింట్ ఇస్తుంది.