Begin typing your search above and press return to search.

ఎర్ర కోకలో బంగారు పాప..!

లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన రెడ్ కలర్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   26 July 2024 4:25 AM GMT
ఎర్ర కోకలో బంగారు పాప..!
X

తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పడినా ఆ క్రేజ్ ని వాడుకోలేక ప్రస్తుతం కెరీర్ లో కాస్త వెనుకబడి నట్టు అనిపిస్తుంది బేబమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమ్మడు ఆ క్రేజ్ తో అరడజను సినిమాల దాకా ఛాన్సులు అందుకోగా వాటిని వెంటనే వెంటనే చేసేసింది. అయితే అవి పూర్తయ్యాక కానీ తన తప్పు తెలుసుకోలేదు కృతి శెట్టి. ఐతే ఇప్పుడు కథల విషయంలో ఆచి తూచి అడుగులేయాలని అనుకుంటున్నా ఛాన్సులు లేక సతమతమవుతుంది.

అందుకే తన ఫోకస్ అంతా తమిళ పరిశ్రమ మీద పెట్టింది అమ్మడు. అక్కడ రెండు సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి మలయాళంలో కూడా టోవినో థామస్ తో జత కడుతుంది. ఐతే తెలుగులో మళ్లీ తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్న కృతి శెట్టి ఫ్రీ టైం లో ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన రెడ్ కలర్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎర్ర కోకలో అందాల భామ బంగారు పాపలా దగ దగ మెరిసిపోతుంది. ఆ శారీకి తగినట్టుగానే మెడ చుట్టూ ఒక బ్లూ కలర్ రాళ్ల చెయి. వాటికి మ్యాచ్ అయ్యేలా చెవి జుంకీలు అబ్బో బేబమ్మని చూస్తే కుర్రాళ్లు డిస్ట్రబ్ అవ్వడం మాత్రం ఖాయం. కట్టింది శారీనే అయినా తన ఓర కళ్లతో ఫాలోవర్స్ హృదయాలను గిలిగింతలు పెడుతుంది కృతి శెట్టి. ఈమధ్య ఫోటో షూట్స్ లో కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు కనిపిస్తుండగా ఎలాగైనా టాలీవుడ్ లో తిరిగి ఛాన్సులు అందుకోవాలని చూస్తుంది.

కృతి శెట్టి రీసెంట్ గా శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందని అనుకుంటే అది జరగలేదు. టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయని కృతి శెట్టి ఇక్కడ ఆడియన్స్ ని మెప్పించే మరో సినిమాతో రావాలని ప్రయత్నాలు చేస్తుంది. మరి బేబమ్మ కంబ్యాక్ మూవీ ఏది అవుతుంది. ఉప్పెన లాంటి మరో సూపర్ హిట్ ఆమె ఖాతాలో ఎపుడు పడుతుంది అన్నది చెప్పడం కష్టం. అయితే సినిమాలు చేసినా చేయకపోయినా ఫాలోవర్స్ కి తన ఫోటో షూట్స్ తో ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది కృతి శెట్టి.