Begin typing your search above and press return to search.

కృతి శెట్టి.. ది సన్ షైన్ బ్యూటీ!

కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. చదువుకుంటూనే మోడల్ గా రాణించిన అమ్మడు

By:  Tupaki Desk   |   21 July 2024 6:18 AM GMT
కృతి శెట్టి.. ది సన్ షైన్ బ్యూటీ!
X

కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. చదువుకుంటూనే మోడల్ గా రాణించిన అమ్మడు.. చిన్నప్పటి నుంచే మంచి అవకాశాలు అందుకోవడం స్టార్ట్ చేసింది. పెంటాక్, లైఫ్ బాయ్, డైరీ మిల్క్ సిల్క్ వంటి పలు యాడ్స్ చేసి మెప్పించింది కృతి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీలో స్టూడెంట్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఉప్పెన మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం ఇచ్చారు. బేబమ్మ పాత్రలో నటించి.. యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత తక్కువ గ్యాప్‌ లోనే నాని శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య బంగార్రాజు చిత్రాలతో హిట్స్ కొట్టేసింది కృతి శెట్టి.

కానీ ఆ తర్వాత ఆమె తన వరుస సినిమాలతో మెప్పించలేకపోయింది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. రీసెంట్ గా వచ్చిన శర్వానంద్ మనమే మూవీ కూడా మిక్స్ డ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేవు. కానీ తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో మాత్రం అమ్మడు అదరగొడుతోంది. అజయంటే రాందం మోషనమ్ సహ పలు సినిమాలు చేస్తోంది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది కృతి శెట్టి. స్టైలిష్ ఔట్ ఫిట్స్ లో మెరుస్తూ.. ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ లవర్స్ కు తన డ్రెస్సెస్, గ్లామర్ తో మెప్పిస్తుంది. అదిరిపోయే అందాలతో వావ్ అనిపిస్తుంది. సన్నని నడుము, చిరునవ్వుతో అట్రాక్ట్ చేస్తుంది. సూపర్ స్కిన్ టోన్ తో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా లైట్ ఎల్లో కలర్ మినీ డ్రెస్ లో కనువిందు చేసింది అమ్మడు. వీపందాలను చూపిస్తూ కవ్విస్తోంది. సూర్యుని వెలుగులో తన గ్లోయింగ్ స్కిన్ తో మైమరపిస్తోంది. ఓర చూపులతో కుర్రాళ్లను మాయ చేస్తోంది. నడుము మడతలతో హీట్ పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న కృతి పిక్స్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. బేబమ్మ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్ కృతి అంటూ పొగుడుతున్నారు.