Begin typing your search above and press return to search.

జారిపోనివ్వ‌కండి.. జీవితంపై కృతి ఫిలాస‌ఫీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న తీన్ మార్, సుమంత్ స‌ర‌స‌న బోణి చిత్రాల్లో న‌టించింది కృతి క‌ర్భంద‌.

By:  Tupaki Desk   |   17 March 2025 11:29 PM IST
జారిపోనివ్వ‌కండి.. జీవితంపై కృతి ఫిలాస‌ఫీ
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న తీన్ మార్, సుమంత్ స‌ర‌స‌న బోణి చిత్రాల్లో న‌టించింది కృతి క‌ర్భంద‌. చివ‌రిగా చ‌ర‌ణ్ `బ్రూస్ లీ` చిత్రంలో సిస్ట‌ర్ పాత్ర‌లో న‌టించింది. కానీ కృతికి హిందీలో అవ‌కాశాలు రావ‌డానికి క‌లిసొచ్చింది. మ‌ల్టీస్టార‌ర్ హౌస్ ఫుల్ 4 -పాగ‌ల్ పానీ.. చెహ్రే లాంటి భారీ చిత్రాల్లో న‌టించింది. త‌మిళంలో `వాన్` అనే చిత్రంలోనూ నాయిక‌గా న‌టించింది. తానిష్ - 14 పేరే లాంటి చిత్రాల‌లో చివ‌రిగా న‌టించింది. ఇప్పుడు న‌టిగా త‌న కెరీర్ దాదాపు ముగిసింది.

మ‌రోవైపు తన ప్రియుడిని పెళ్లాడి హ్యాపీ లైఫ్ లోకి అడుగు పెట్టింది. కృతి క‌ర్బందా స‌హనటుడు పుల్కిత్ సామ్రాట్ తో డేటింగ్ చేసింది. వీరే కి వెడ్డింగ్- పాగల్‌పంతి -తాయిష్ చిత్రాల‌లో పుల్కిత్ కృతికి సహనటుడు. ఈ జంట‌ 2019 నుండి రిలేష‌న్ షిప్ లో ఉన్నారు. త‌ర్వాత పెళ్లి వేడుక నుంచి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

మ‌రోవైపు కృతి రెడ్ హాట్ బికినీలో ఎంతో జోష్ ఫుల్ గా క‌నిపించిన ఫోటోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. చేతి వేళ్ల‌లోంచి జారిపోతున్న ఇసుక‌ను చూపిస్తూ ఇలా జారిపోనివ్వ‌కండి అని రాసింది. ఇన్ స్టాలో ఈ ఫోటోషూట్ తో పాటు అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. సోమవారం మంత్రం జ‌పించి సూర్యుడిని తరించండి.. ఇసుక మీ వేళ్లలోంచి జారిపోనివ్వండి. ఎల్లప్పుడూ మీ గురించి బెస్ట్ విష‌యాలు తెలిసిన వ్యక్తిని వివాహం చేసుకోండి అని కూడా సందేశం ఇచ్చింది. కృతి కెరీర్ ప‌రంగా చాలా విష‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తోంది.