కృతిసనన్ ఛాన్స్ కియారా తన్నుకుపోయిందా?
అలనాటి అందాల బాలీవుడ్ తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Oct 2024 10:30 AM GMTఅలనాటి అందాల బాలీవుడ్ తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. సిద్దార్ద్ పి. మల్హోత్రా ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం స్టోరీ సహా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించలనుకున్నారు. కానీ స్టోరీ విషయంలో ఇంకా లోతైన విశ్లేషణ అవసరమని వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. అయితే మీనా కుమారి పాత్ర కోసం ఇప్పటికే కృతిసనన్ పేరు పరిశీలించారు.
దాదాపు ఆమె ఎంట్రీ కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆమెను తప్పించి కృతిసనన్ స్థానంలో కియారా అద్వాణీ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మీరా కుమారి పాత్రకు కృతిసనన్ కంటే కియారా అయితే పర్పెక్ట్ గా సూటవుతుందని, ఆమె ఆహార్యంలో ఒదిగిపోతుందని మేకర్స్ భావించి ఆమె ఎంపిక దిశగానే అడుగులు వేస్తున్నారుట. కియారా ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తారని సమాచారం. ఈ చిత్రానికి `కమల్ ఔర్ మీనా` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. అయితే నటిగా ఇద్దరు ఫాంలో ఉన్నవారే. కియారా కంటే మరింత ఫాంని కొనసాగిస్తుంది కృతిసనన్. జాతీయ ఉత్తమ నటిగానూ చిన్న వయసులోనే అవార్డు సైతం అందుకుంది. కెరీర్ ప్రారంభించిన పదేళ్లలోనే జాతీయ అవార్డు రావడం విశేషం. అలాంటి నటిని తప్పించి మేకర్స్ కియారా వైపు మెగ్గు చూపడం ఇంట్రెస్టింగ్.
ప్రస్తుతం కియారా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా `గేమ్ ఛేంజర్` లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `వార్ -2`లోనూ నటిస్తోంది. ఇందులో అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రాలు.