Begin typing your search above and press return to search.

MS ధోని కుటుంబంలో కుర్రాడితో కృతి డేటింగ్‌కి ప్రూఫ్

ఈ ఫోటోలు వీక్షించాక కృతి పరోక్షంగా కబీర్‌తో తన సంబంధాన్ని అధికారికం చేసింద‌ని మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 3:52 PM GMT
MS ధోని కుటుంబంలో కుర్రాడితో కృతి డేటింగ్‌కి ప్రూఫ్
X

1-నేనొక్క‌డినే, దోచేయ్ సినిమాల్లో న‌టించింది కృతి స‌నోన్. త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సులు దోచేసిన ఈ బ్యూటీ ఇటీవ‌ల హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిమిత‌మైంది. అక్క‌డ వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతూ కెరీర్ ప‌రంగా దూసుకెళుతోంది. కృతి సనన్ చివరిసారిగా దో పట్టి -తేరీ బాతోన్ మే ఐసా జియా, క్రూ లాంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌లో న‌టించింది. 'మిలీ' చిత్రంతో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డును అందుకుంది.

మ‌రోవైపు కృతి వ్య‌క్తిగ‌త జీవితం కార‌ణంగాను నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ బ్యూటీ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, అత‌డి భార్య సాక్షికి సన్నిహితుడు అయిన బిజినెస్‌మేన్ కబీర్ బహియాతో డేటింగ్ చేస్తోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు విదేశాల్లో ఈ జంట క‌లిసి షికార్లు చేస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. దీంతో ఈ జంట డేటింగ్ పై చాలా పుకార్లు షికార్ చేస్తున్నాయి. క‌బీర్ త‌న‌కంటే 9ఏళ్లు చిన్న‌వాడు. అయినా కృతితో ప్రేమ‌లో ప‌డ్డాడు! అంటూ చ‌ర్చ సాగుతోంది.

ఇదిలా ఉండ‌గానే క్రిస్మ‌స్ 2024 వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు ఇంట‌ర్నెట్ లో తుఫాన్ గా మారాయి. ఆ ఇద్ద‌రూ జంట‌గా క‌లిసి ఉన్నారు. ఈ ఫోటోలు వీక్షించాక కృతి పరోక్షంగా కబీర్‌తో తన సంబంధాన్ని అధికారికం చేసింద‌ని మాట్లాడుకుంటున్నారు. క్రిస్మ‌స్ వేడుక‌ల నుంచి వ‌చ్చిన ఫోటోల‌లో మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్.ధోనీతో క‌లిసి పోజులిచ్చింది. ఈ ఫోటోల‌లో ధోని శాంటాగా క‌నిపిస్తున్నారు. ఫోటోల‌లో ధోని-సాక్షి జంటగా క‌నిపించారు. కృతి క్రిస్మస్ స్వెటర్, తెల్లని షార్ట్ ధరించి క‌బీర్ బాహియాకు అత్యంత స‌న్నిహితంగా ఫోజులిచ్చింది. ''కబీర్ పాదాలతో కృతి పాదాలు'' క‌లిసి ఉన్న ఓ ఫోటోను కూడా కృతి షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ త‌మ డేటింగ్ కి సింబాలిక్ అని అభిమానులు భావిస్తున్నారు. సాక్షి-ధోని జంట‌ కుమార్తె జివా ధోనీని కూడా ఈ ఫోటోల్లో చూడొచ్చు.

కబీర్ బహియా ఎవరు?

క‌బీర్ బాహియా పంజాబీ కుటుంబానికి చెందిన యువ‌కుడు. అత‌డి వ‌య‌సు 25. నవంబర్ 20, 1999న జన్మించాడు. ఇంగ్లాండ్‌- సోమ‌ర్‌సెట్‌లోని పాపుల‌ర్ బోర్డింగ్ స్కూల్ అయిన‌ మిల్‌ఫీల్డ్‌లో చదివాడు. సోష‌ల్ మీడియాల్లో త‌న వ్య‌క్తిగ‌త కుటుంబ విష‌యాల‌ను అత‌డు షేర్ చేస్తుంటాడు. ఇన్ స్టాలో 52.6K అనుచరులను క‌లిగి ఉన్నాడు. k.a.b.b.s అనే ఇన్‌స్టాలో త‌న విష‌యాల‌ను షేర్ చేస్తుంటాడు. అత‌డి తండ్రి కుల్జిందర్ బహియా.. సౌతాల్ ట్రావెల్ పేరుతో UKలో పాపుల‌ర్ ట్రావెల్ కంపెనీని స్థాపించారు. రూ. 427 కోట్ల నికర ఆస్తుల‌తో ప్రధానంగా లండన్‌లో ఉన్న కుటుంబం ఇది. 2019లో సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌ జాబితాలో నిలిచింది.

కబీర్ ఏం జాబ్ చేస్తాడ‌నేది ఇప్ప‌టికి సీక్రెట్. కానీ అత‌డు సంప‌న్న కుటుంబంలో జ‌న్మించాడ‌ని అత‌డి జీవ‌న శైలి చెబుతుంది. త‌న‌ కంటే 9 ఏళ్లు పెద్దది అయిన కృతి సనన్‌తో అత‌డు ప్రేమ‌లో ప‌డ‌టం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.