కృతి సక్సెస్ పార్టీలో ముద్దుగుమ్మలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ లు పాల్గొన్నారు. వీరిద్దరితో కృతి శెట్టి కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 13 Nov 2024 10:19 AM GMTటాలీవుడ్లో పదేళ్ల క్రితం మహేష్ బాబు మూవీ '1 నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి సనన్. మొదటి సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్లో ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టింది. హిందీలోనూ మొదట ప్రేక్షకుల ఆధరణకు నోచుకోని కృతి సనన్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్గా సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి పాత్రలో నటించడం ద్వారా చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను వరుసగా చేస్తున్న కృతి సనన్ తాజాగా 'దో పత్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'దో పత్తి' సినిమాలో కృతి సనన్ అక్క చెల్లి పాత్రల్లో నటించింది. డ్యూయెల్ రోల్లో నటించడంతో పాటు స్వయంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అక్టోబర్‌లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దో పత్తి సినిమాకు మంచి స్పందన దక్కింది. కృతి సనన్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా సినిమా ఒక మంచి మెసేజ్ తో కూడినదిగా అభినందనలు దక్కించుకుంది. అందుకే కృతి సక్సెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు ఇలా సినిమాలు హిట్ అయినప్పుడు సక్సెస్ పార్టీలు చేసుకోవడం చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది.
కృతి ఇచ్చిన 'దో పత్తి' సక్సెస్ పార్టీలో బాలీవుడ్‌కు చెందిన స్టార్ సీనియర్ హీరోయిన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ లు పాల్గొన్నారు. వీరిద్దరితో కృతి శెట్టి కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కృతికి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యులు అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒకరిపై ఒకరికి కోపం లేకుండా అంతా కలిసి ఇలా పార్టీలు చేసుకోవడం మంచి పరిణామం అని, ఇలాంటిదే తెలుగు హీరోయిన్స్ ల్లో కూడా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దో పత్తి సినిమాలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింసను గురించి చూపించడం జరిగింది. శశాంక చతుర్వేది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అక్కా చెల్లెల్లు ఒకే వ్యక్తిని ప్రేమించడం, ఆ తర్వాత వారిలో ఒకరు అతడిని పెళ్లి చేసుకోవడంతో కథ మొదలు అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత గృహ హింసకు గురి అయ్యే సోదరి కోసం మరో సోదరి ఏం చేస్తుంది. చివరకు కథ ఎలాంటి మలుపులు తీసుకుని ముగుస్తుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కాజోల్ కీలక పాత్రలో నటించి మెప్పించింది.