ఆ హీరోకు సీతమ్మ సెట్ అయిపోయింది!
కోలీవుడ్ స్టార్ ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ మూడవ చిత్రానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Jan 2025 4:30 PM GMTకోలీవుడ్ స్టార్ ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ మూడవ చిత్రానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబోలో రిలీజ్ అయిన 'రాంఝానా', 'ఆంత్రంగిరే' సంచలనం విజయాలు సాధించడంతో? బాలీవుడ్ లో ధనుష్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో మళ్లీ ఐదేళ్ల తర్వాత మచ్చటగా మూడవసారి చేతులు కలిపారు. 'తేరే ఇష్క్ మే' అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేమలో విఫలమైన ఓ యువకుడి కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ఆ యువకుడి పాత్రలో ధనుష్ నటిస్తున్నాడు. కథలో బలమైన ఎమోషన్ తో పాటు అంతకు మించి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సమాచారం. దీంతో ధనుష్ ఈసారి కాస్త కండీషన్లు లేకుండానే నటించాల్సి వస్తోంది. స్టోరీ డిమాండ్ మేరకు ఆనంద్ ఎల్ రాయ్ ఇంటిమేట్ సన్నివేశాల చాన్స్ తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ధనుష్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు.
రకరకాల బాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చాయి గానీ హీరోయిన్ ఫైనల్ కాలేదు. తాజాగా ఆ పాత్రకు కృతిసనన్ ని ఫైనల్ చేసారు. ఈ విషయాన్ని కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని ప్రేమ కథలు అగ్ని నుంచి పుట్టుకొస్తాయి అనే వ్యాఖ్యలను జోడించింది. దీంతో ధనుష్-కృతిసనన్ మధ్య ప్రేమ ప్రయాణం మొదలైనట్లు తెలుస్తోంది. గతంలో ధనుష్ తో ఆనంద్ తెరకెక్కించిన రెండు చిత్రాల్లోనూ ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ని తీసుకోలేదు.
అవి రెండు క్లాసిక్ స్టోరీలుగానే కనిపించాయి. కానీ ఈసారి ఆనంద్ బోర్డర్ దాటి పాత్రల్ని సృష్టించినట్లు తెలుస్తోంది. 'తేరే ఇష్క్ మే' లో రసవత్తరమైన రొమాంటిక్ సన్నివేశాల్ని రాసినట్లు వినిపిస్తుంది. ధనుష్ దర్శకుల హీరో. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ సన్నివేశాలకు ఛాన్స్ తీసుకోలేదు. కానీ ఈసారి తప్పడం లేదు.