Begin typing your search above and press return to search.

సెట్స్ కి వెళ్తే నీరసం..నిద్ర వ‌చ్చేస్తున్నాయ్!

ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి అనతి కాలంలో నే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేడు న‌వ‌త‌రం భామ‌ల‌కు ఆద‌ర్శంగానూ నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 8:15 AM GMT
సెట్స్ కి వెళ్తే నీరసం..నిద్ర వ‌చ్చేస్తున్నాయ్!
X

కృతిస‌న‌న్ అలియాస్ సీత‌మ్మ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. చిన్న వ‌య‌సులోనే జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకుని భార‌తీయుల మ‌దిలో ప్ర‌త్యేక స్థానం సంపాదించింది. ఎంతో మంది సీనియ‌ర్ న‌టీమ‌ణ‌లు.. స‌హ చ‌రులు ఉన్నా ఎవ‌రికీ సాధ్యం కానిది చిన్న వ‌య‌సులోనే సాధ్యం చేసింది. ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి అనతి కాలంలో నే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేడు న‌వ‌త‌రం భామ‌ల‌కు ఆద‌ర్శంగానూ నిలుస్తోంది.

అలాంటి భామకు సెట్లోకి వెళ్తే నిద్ర వ‌చ్చేస్తుంద‌ని ఎంత మందికి తెలుసు. అవును ఈ విష‌యాన్ని కృతిస‌నన్ స్వ‌యంగా తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాను. అద్భుత‌మైన న‌టుల‌తో , అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసాను. కానీ నేను ఛాలెంజింగ్ పాత్ర‌ల్లో న‌టిస్తేనే సెట్ లో ఉత్సాహంగా ఉంటాను. ఎప్పుడెప్పుడు వెళ్లి సెట లో నా పాత్ర స‌న్నివేశాలు పూర్తి చేస్తానా? అనే ఉత్సాహంతో ఎదురు చూస్తాను.

కొన్నిసార్లు స‌వాల్ లేని పాత్ర‌లు చేయాల్సి వ‌స్తుంది. అప్పుడు సెట్ లో ఉత్తేజంగా ఉండ‌లేను. నీరసం..నిద్ర వ‌చ్చేస్తాయి. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి సంతృప్తి కూడా క‌ల‌గ‌దు. కెరీర్ ఆరంభంలో ఎలాంటి పాత్ర‌లు ఎంపిక చేసుకోవాలో తెలిసేది కాదు. పాత్ర‌ల గురించి తెలుసుకోవ‌డానికి ప‌దేళ్లు స‌మ‌యం ప‌ట్టింది.

ఎలాంటి పాత్ర చేయాలి? ఎలాంటి వాటిని రిజెక్ట్ చేయాలి? పాత్ర‌ను ఎలా ఎనాల‌సిస్ చేసుకోవాలి? క‌థ‌ను అర్దం చేసుకునే విధానం ఇవ‌న్నీ ఇప్పుడు బాగా అల‌వాటు అయ్యాయి` అని తెలిపింది. ఇటీవ‌లే అమ్మ‌డు `క్రూ`తో మంచి విజ‌యం అందుకుంది. తాజాగా నేడు `దో ప‌త్తి` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ చిత్రాన్ని తానే స్వ‌యంగా నిర్మించింది.