నేపోటిజం సర్కిల్.. మహేష్ బ్యూటీ తెలివైన సమాధానం
ఆమె మాట్లాడుతూ, "నేపోటిజానికి పరిశ్రమ మాత్రమే కారణం కాదు. ప్రేక్షకులు, మీడియా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి.
By: Tupaki Desk | 26 Nov 2024 10:30 PM GMTఫిల్మ్ ఇండస్ట్రీలో నేపోటిజంపై తరచుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ లేదని కావాలని తమకు అవకాశాలు ఇవ్వడం లేదని కొందరు ఇంటర్వ్యూలలో చెప్పే విధానం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అయితే ఎంత బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా టాలెంట్ అనేది లేకుంటే ఇండస్ట్రీలో ఉండడం కష్టమని మరికొందరు చెబుతున్నారు. ఇక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తేనే అసలు ఇబ్బంది అని, అలా వచ్చే వారిపై ప్రేక్షకులు ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటారు, దాన్ని అందుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని అంటూ ఇంకొందరు చెబుతుంటారు.
ఇక గతంలో స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీలకు పరిచయం చేసే ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తాను నేపోటిజం తండ్రిని అంటూ సెటైర్ వేసుకున్నాడు. అయితే, ఈ పరిస్థితుల మధ్యలోనూ కొందరు నటీనటులు తమ ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అటువంటి వారిలో కృతి సనన్ ఒకరు. గోవాలో జరిగిన 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న కృతి సనన్, నేపోటిజంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడుతూ, "నేపోటిజానికి పరిశ్రమ మాత్రమే కారణం కాదు. ప్రేక్షకులు, మీడియా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి. స్టార్ కిడ్స్ మీద మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తే, ప్రేక్షకులు వారిని చూడటానికి ఆసక్తి చూపుతారు. దాంతో పరిశ్రమ ఆ స్టార్ కిడ్స్‌తో సినిమాలు చేయాలని భావిస్తుంది. ఇది ఒక తెలియని ఊహించని సర్కిల్ లా జరుగుతూ ఉంటుంది," అని తన వివరణ ఇచ్చింది.
అయితే, టాలెంట్ అనేది ఎప్పుడూ అవకాశాలను కల్పిస్తుందని, ప్రతిభ లేని వారు ప్రేక్షకులతో సంబంధాన్ని ఏర్పరచుకోలేరని కృతి అభిప్రాయపడింది. "మీరు టాలెంట్‌తో ఉన్నప్పుడు మీకు అవకాశం దొరుకుతుంది. కానీ, ప్రేక్షకులతో మీకేమీ కనెక్ట్ లేకపోతే, నిలబడడం చాలా కష్టమే," అని ఆమె మళ్ళీ తెలివిగా వివరించింది. కృతి కాంట్రవర్సీకి తావివ్వకుండా నెపోటిజమ్ మంచి సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక కృతి సనన్ సోదరి నుపూర్ సనోన్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. అలాగే మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కృతి సనోన్ కెరీర్ విషయానికి వస్తే తన సినీ ప్రయాణాన్ని మహేష్ బాబు 1-నేనొక్కడినే చిత్రంతో ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో హీరోపంతితో డెబ్యూ చేసింది. ఈ చిత్రంలో టైగర్ శ్రాఫ్ హీరోగా నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అమ్మడు మూడు ప్రాజెక్టులని లైన్ లో పెట్టింది.