Begin typing your search above and press return to search.

పెళ్లిలో బోయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన న‌టి

ఎట్ట‌కేల‌కు క‌బీర్ బాహియా ఫ్యామిలీలో పెళ్లికి హాజరు కావడం ద్వారా కృతి త‌న రిలేషన్ షిప్ ని ఖ‌రారు చేసిందంటూ పుకార్ షికార్ చేస్తోంది. కృతి ప్రియుడికి రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 4:55 PM GMT
పెళ్లిలో బోయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన న‌టి
X

బాలీవుడ్ నటి కృతిసనన్ బ్రిటన్ కి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు షికార్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట విహార‌యాత్ర నుంచి ఒక అంద‌మైన ఫోటోగ్రాఫ్ ఇంత‌కుముందు వైర‌ల్ అయింది. కొన్ని నెల‌లుగా వీరి సాన్నిహిత్యంపై నిరంత‌రం వార్తా క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నా .. దానిని ఎవ‌రూ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. అలాగ‌ని ఖండించ‌నూ లేదు.

ఎట్ట‌కేల‌కు క‌బీర్ బాహియా ఫ్యామిలీలో పెళ్లికి హాజరు కావడం ద్వారా కృతి త‌న రిలేషన్ షిప్ ని ఖ‌రారు చేసిందంటూ పుకార్ షికార్ చేస్తోంది. కృతి ప్రియుడికి రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంది. పైగా ఇన్‌స్టాలో కబీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇది ఊహాగానాలను మరింతగా పెంచింది. పెళ్లిలో కృతి సంద‌డి చూశాక ఈ జంట మ‌ధ్య విష‌యం ముదిరింద‌ని మీడియా ఊహిస్తోంది.

ఈ పెళ్లిలో కృతి ఎంతో స్టైలిష్ గా క‌నిపించింది. షేడ్స్ ధ‌రించిన కృతి భారతీయ వస్త్రధారణలో అద్భుతంగా క‌నిపించింది. కృతి తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియాకు చిక్క‌కుండా దాచి ఉంచుతోంది. త‌న‌ కెరీర్‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతోంది. ఇటీవల మిమీలో తన అద్భుతమైన నటనకు జాతీయ అవార్డును కూడా అందుకుంది. బాలీవుడ్ అత్యంత ప్ర‌తిభావంతురాలైన‌ నటీమణులలో ఒకరిగా వెలుగొందుతోంది. ఇప్పుడు క‌బీర్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కనిపించడం ఆసక్తిని కలిగించింది. ఇది ఊహాగానాల‌ను నిజం చేసేలా క‌నిపిస్తోంది. క‌బీర్ తో త‌న ప్రేమ‌ను ఏదో ఒక రోజు కృతి ఓపెన‌వుతుంద‌ని అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది. ఇటీవ‌ల క్రూ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించాక కృతి కొంత గ్యాప్ తీసుకుంది. దోప‌ట్టీ అనే సినిమాని కూడా సొంత బ్యాన‌ర్ లో నిర్మించింది.