'ఉప్పెన' బ్యూటీకి టాలీవుడ్ సెకెండ్ ఛాన్స్!
చిత్రీకరణ మొదలవుతోన్న నేపథ్యంలో హీరోయిన్ పై ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో నానికి జోడీగా చాక్లెట్ బ్యూటీ కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 7 April 2025 6:30 PMనేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ ఆన్ సెట్స్ కి వెళ్లకుండా గ్లింప్స్ తో ఏ రేంజ్ లో షేక్ చేస్తోందో తెలిసిందే. నాని మాస్ లుక్....గ్లింప్స్ తో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. శ్రీకాంత్ ఓదెల నాని ని ఎలా చూపిం చబోతున్నాడు? అన్న ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంతవరకూ క్లారిటీ లేదు. ఫోకస్ అంతా నాని రోల్ వైపు ఉండటంతో ఇప్పటి వరకూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
చిత్రీకరణ మొదలవుతోన్న నేపథ్యంలో హీరోయిన్ పై ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో నానికి జోడీగా చాక్లెట్ బ్యూటీ కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ రాసిన పాత్రకు కృతిశెట్టి పర్పెక్ట్ గా సెట్ అవుతుందట. దీంతో ఆమె ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. కృతిశెట్టికిది గొప్ప అవకాశమనే చెప్పాలి.` ఉప్పెన` తర్వాత అమ్మడు కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు.
దీంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడా పరిస్థితి నత్త నడకనే సాగుతోంది. టాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నా రావడం లేదు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ప్యారడైజ్ లో శ్రీకాంత్ ఛాన్స్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కృతి శెట్టి మంచి పెర్పార్మర్ అని తొలి సినిమా 'ఉప్పెన'తోనే ప్రూవ్ చేసింది. కానీ కాలం కలిసి రాకపోవడంతో స్టార్ లీగ్ లో చేరలేకపోయింది. కానీ ఇప్పుడా సెకెండ్ ఛాన్స్ మళ్లీ వచ్చింది.
భారీ హైప్ ఉన్న చిత్రంలో ఛాన్స్ అందుకున్న నేపథ్యంలో కృతి పేరు టాలీవుడ్ లో మళ్లీ మారు మ్రోగుతోంది. ఈ సినిమా లైన్ లో ఉండగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. మూడు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇంతలోనే టాలీవుడ్ ఛాన్స్ తలుపు తట్టింది.