ప్రెండ్షిప్ డేని అక్కా-చెల్లి ఈ రేంజ్ లోనా?
బాలీవుడ్ సిస్టర్స్ కృతిసనన్-నుపుర్ సనన్ గురించి పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 4 Aug 2024 5:51 PM GMTబాలీవుడ్ సిస్టర్స్ కృతిసనన్-నుపుర్ సనన్ గురించి పరిచయం అవసరం లేదు. కృతి సనన్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వెలిగిపోతుంది. టాలీవుడ్ లో తడబడినా అమ్మడికి బాలీవుడ్ మాత్రం కలిసొ చ్చింది. కొన్నిసినిమాలకే జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం అందుకుని ట్యాలెంట్ టెడ్ బ్యూటీ అనిపిం చింది. సొంతంగా నిర్మాణ సంస్థను సైతం స్థాపించి సినిమాలు నిర్మిస్తుంది. ఆ రకంగా కృతి కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు.
కానీ చెల్లి నుపుర్ మాత్రం ఇంకా నిలదొక్కుకోలేదు. రెండు , మూడు సినిమాలు చేసింది గానీ ఇంకా గుర్తింపు రాలేదు. దీంతో చెల్లి కెరీర్ ని సెట్ చేసే పనిలోనూ కృతి బిజీగా ఉంది. తనకున్న పరిచయాలతో రికమండీ షన్లు చేయిస్తోంది. ఇలా ఇద్దరు వృత్తిపరంగా ముందుకు సాగుతున్నారు.మరి వ్యక్తిగతంగా ఎలా ఎంజాయ్ చేస్తారంటే? ఈ ఉదంతాన్ని చెప్పాల్సిందే. నేడు ప్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులంతా సెలబ్రేట్ చేసుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ విషయంలో మేము కూడా తక్కువ కాదంటూ ఇలా అక్కా-చెల్లి కూడా స్నేహితులుగా మారిపోయారు. అక్కా-చెల్లి కంటే ఇద్దరి మధ్య స్నేహితులు అనే బంధం బలంగా ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఫోటోలు చూసి చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడి లా ఇద్దరు చిట్టిపొట్టి దుస్తుల్లో అలరిస్తోన్నవైనమే చెబుతోంది వాళ్లెంత క్లోజ్ అన్నది. గ్లామర్ ఎలివేషన్లు సిస్టర్స్ ఇద్దరు పోటీ పడి మరీ వండి వార్చారు.
ఇరువురు మల్టీకలర్ దుస్తుల్లో స్కిన్ షోతో ఆకట్టుకుంటున్నారు. లేక్ ముందు ఇలా సెల్పీలు దిగి వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోని ఉద్దేశించి ఇలా రాసుకొచ్చింది. `నేను మీతో ఉన్నప్పుడు నన్ను బాగా ఇష్టపడతారు. మరి నా ప్రాణ స్నేహితురాలితో ఉన్నప్పుడు..అంతకు మించి కదా? అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.