Begin typing your search above and press return to search.

ఉప్పెన పాప.. పొట్టి స్కర్ట్ లో మైండ్ బ్లోయింగ్

బ్లూ కలర్ జీన్స్ స్కర్ట్ లో అమ్మడు మతిపోయేలా లెగ్స్ అందాలను హైలెట్ చేసింది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 7:20 AM GMT
ఉప్పెన పాప.. పొట్టి స్కర్ట్ లో మైండ్ బ్లోయింగ్
X

మొదట కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఆ రూట్లోనే అమ్మడికి మొదటి సినిమా అవకాశం లభించింది. చూడగానే తన చందమామ లాంటి మొహంతో ఆకట్టుకునే ఈ చిన్నది రెండు పదుల వయసులోకి రాకముందే అగ్ర హీరోయిన్స్ కు సైతం పోటీని ఇచ్చేలా ఎంట్రీ అయితే ఇచ్చింది.


మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పాప అదృష్టానికి లక్కు కూడా బాగా కలిసి రావడంతో మొదట్లోనే బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత అమ్మడు కొన్ని అపజయాలు కూడా ఎదుర్కొన్నప్పటికీ తన గ్లామర్ తో మాత్రం ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది.


ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు కూడా నెటిజన్ల మతిపోగొట్టేస్తున్నాయి. కాస్త వెండితెరకు గ్యాప్ ఇచ్చిన అమ్మడు లండన్లో ప్రస్తుతం హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే అక్కడ కృతి శెట్టి దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. బ్లూ కలర్ జీన్స్ స్కర్ట్ లో అమ్మడు మతిపోయేలా లెగ్స్ అందాలను హైలెట్ చేసింది.


దానికి తోడు వైట్ స్టైలిష్ టీ షర్టులో కూడా అద్భుతమైన స్టిల్ అయితే ఇచ్చింది. ఇక కాస్త ఎద అందాలను కూడా హైలెట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మడి స్టైలిష్ పోజు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి వరుసగా కొన్ని డిజాస్టర్ ఎదురైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతుంది.


అంతేకాకుండా గ్లామరస్ పాత్రలు కూడా చేయగలను అని ఎప్పటికప్పుడు ఇలాంటి ఫోటోలతో ఒక సందేశం అయితే ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు లాంటి సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకున్న ఈ చిన్నది ఆ తరువాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం లాంటి కమర్షియల్ సినిమాలతో డిజాస్టర్స్ చూసింది. అలాగే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కస్టడీ లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం మలయాళంలో అలాగే తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది.