Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : తీన్మార్‌ బ్యూటీ వైట్‌ డ్రెస్‌ అందం

బోణి సినిమా తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభం లో పవన్ కళ్యాణ్ తో తీన్మార్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:46 AM GMT
పిక్ టాక్‌ : తీన్మార్‌ బ్యూటీ వైట్‌ డ్రెస్‌ అందం
X

బోణి సినిమా తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభం లో పవన్ కళ్యాణ్ తో తీన్మార్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. అయినా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చింది.


పెద్ద హిట్స్ లేకున్నా కూడా ఈ అమ్మడు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉందంటే కచ్చితంగా ఇలాంటి అందాల ఫోటోలు షేర్‌ చేయడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్‌ గా ఓ రేంజ్ అందాల ప్రదర్శణ చేసే అవకాశం రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె జోరు కొనసాగుతూ ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.


తాజాగా ఇలా వైట్‌ డ్రెస్ లో నడుము నాభి అందాలను చూపిస్తూ షేర్‌ చేసిన ఫోటో షూట్ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా కృతి కర్బంద అందంగా ఉంది, అంతే కాకుండా స్కిన్‌ షో విషయంలో కూడా ఈమె ఏమాత్రం తగ్గడం లేదు. అయినా ఎందుకు ఈమెను సినీ జనాలు పట్టించుకోవడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె చేతిలో ఒక సినిమా ఉంది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్‌ లకి కూడా ఈమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తీన్మార్ బ్యూటీ మళ్లీ బిజీ అయ్యేందుకు ఇలా అందంగా కనిపించడం తో పాటు వచ్చిన ప్రతి ఒక్క అవకాశం ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.