Begin typing your search above and press return to search.

'తీన్ మార్' బ్యూటీ వెడ్డింగ్ ఎఫైర్

పాపుల‌ర్ వెడ్డింగ్ ఎఫైర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ లో పాల్గొన్న కృతి చీర‌లో ఎంతో అందంగా క‌నిపించింది. ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే వేడెక్కించే ఒంపు సొంపుల‌ను తెర‌నిండుగా ఆవిష్క‌రించింది ఈ బ్యూటీ.

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:18 PM GMT
తీన్ మార్ బ్యూటీ వెడ్డింగ్ ఎఫైర్
X

టాలీవుడ్ లో బోణీ- తీన్ మార్ లాంటి చిత్రాల్లో న‌టించింది కృతి క‌ర్భందా. కానీ ఆశించిన స‌క్సెస్ ద‌క్క‌లేదు. బాలీవుడ్ లోను అంతంత మాత్ర‌మే. తర్వాత గెస్ట్ ఇన్ లండన్- షాదీ మే జరూర్ ఆనా - పాగల్ పంథి వంటి కొన్ని చిత్రాలలో నటించింది. అయితే కృతి కొంత గ్యాప్ త‌ర్వాత కెరీర్ ప‌రంగా చెప్పుకోద‌గ్గ అవ‌కాశాల్ని అందుకుంది. హిందీ ప‌రిశ్ర‌మ నుంచి కొన్ని క్రేజీ ఆఫ‌ర్లు త‌న‌ని వ‌రించాయి.


ఇక కృతి వ‌రుస ఫోటోషూట్లు ఇటీవ‌ల అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. పాపుల‌ర్ వెడ్డింగ్ ఎఫైర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ లో పాల్గొన్న కృతి చీర‌లో ఎంతో అందంగా క‌నిపించింది. ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే వేడెక్కించే ఒంపు సొంపుల‌ను తెర‌నిండుగా ఆవిష్క‌రించింది ఈ బ్యూటీ. దీనిపై అభిమానుల నుంచి ఆస‌క్తిక‌ర కామెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయ్. బులుగు జిలుగు చీర‌పై అంబ్రాయిడ‌రీ వ‌ర్క్ ఎంతో ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు సంత‌కాలు చేసిన కృతి త‌న ప్రాజెక్టుల గురించి ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేయాలన్న‌ తన కోరిక మాత్రం ఇప్ప‌ట్లో నెర‌వేరేట్టు లేదు. ఎదిగే క్ర‌మంలో షారుఖ్ ఖాన్ ను నేను ఎక్కువగా అభిమానించే వీరాభిమానిని అని, క‌చ్ లో ఉన్న‌పుడు పాఠశాల స్ట‌డీస్ లో ఉన్న రోజుల్లోనే, కుచ్ కుచ్ హోతా హై ప్ర‌భావం త‌న‌పై తీవ్రంగా ఉంద‌ని తెలిపింది. మాది సినిమా హాళ్లలో సినిమాలు చూడటానికి ఆదివారాలను అంకితం చేసే కుటుంబం... అని కూడా పేర్కొంది.. కృతి చివరిగా 14 ఫేరేలో విక్రాంత్ మాస్సేతో కలిసి కనిపించింది. త‌దుప‌రి సినిమాని ప్ర‌క‌టించాల్సి ఉంది.