బికినీ కంటే ఘాటుగా కృతి అందాలు..అంతకుమించి..
ప్రింటెడ్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు కనిపించేలా హాట్ ఫోజులు ఇచ్చింది. అది కంప్లీట్ గా డ్రెస్ అనీ చెప్పలేం, అలా అని బికినీ అని కూడా అనలేం.
By: Tupaki Desk | 28 Aug 2023 12:07 PM GMTకృతి ఖర్బందా పేరు గుర్తుందా..? ఈ మధ్యాకాలంలో టాలీవుడ్ లో కనపడలేదు కాబట్టి, వెంటనే గర్తుపట్టలేకపోవచ్చు. కానీ, తెలుగులో చాలా సినిమాలే చేసింది. కానీ ఆమె చేసిన ఏ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో, కృతి కూడా చాలా కొద్ది కాలంలోనే టాలీవుడ్ కి దూరమైపోయింది. మొదట సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా క్యూట్ గా ఉండేది. అప్పుడు కూడా పెద్దగా బొద్దుగా ఏమీ ఉండేది కాదు. చక్కగా ఉండేది. కానీ, ఇప్పుడు గుర్తు పట్టడానికి కూడా వీల్లేనంతగా మారిపోయి కనిపించింది.
టాలీవుడ్ లో సినిమాలు చేయకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నిజంగా కృతి యేనా ఇంతలా మారిపోయింది అనే భావన కలిగింది. బాగా చిక్కిపోయింది. అయితే, చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుగా, ఇప్పుడు కూడా అందంగానే ఉంది.
తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో టూమచ్ హాట్ గా కనపడుతోంది. ప్రింటెడ్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు కనిపించేలా హాట్ ఫోజులు ఇచ్చింది. అది కంప్లీట్ గా డ్రెస్ అనీ చెప్పలేం, అలా అని బికినీ అని కూడా అనలేం. అలా ఉంది ఆ డ్రెస్. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఫోటోలు మాత్రం నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక కృతి తెలుగులో బోణి సినిమాతో బోణి కొట్టింది. కానీ, ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత నాని అలా మొదలైందిలో నటించింది. ఆ మూవీ హిట్ అయ్యింది కానీ కృతిది చాలా చిన్న పాత్ర అందుకే ఆ హిట్ ఆమెకు ఉపయోగపడలేదు. రామ్ ఒంగోలు గిత్త, పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, కళ్యాణ్ రామ్ తో ఓమ్ వంటి సినిమాలు చేసింది. మంచి స్టార్లతోనే ఆఫర్లు వచ్చాయి కానీ, ఆ సినిమాలేమీ హిట్ కాలేదు.
చివరకు రామ్ చరణ్ కి అక్క పాత్రలో బ్రూస్ లీ మూవీలో నటించింది. ఈ సినిమా హిట్ అయినా, కనీసం సపోర్టెడ్ రోల్స్ వచ్చేవి. కానీ, అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక చేసేది లేక, టాలీవుడ్ కి వీడ్కోలు పలికి, బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ బెంగళూరులో పెరిగింది. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి, సినిమాల్లోకి వచ్చింది.