Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తీన్ మార్ పిల్ల క‌వ్వింపు త‌గ్గ‌లేదుగా

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే కృతి సిద్ధార్థ్ మల్హోత్రా స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇంత‌కుముందే క‌థ‌న‌లొచ్చాయి

By:  Tupaki Desk   |   3 Aug 2023 4:59 AM GMT
ఫోటో స్టోరి: తీన్ మార్ పిల్ల క‌వ్వింపు త‌గ్గ‌లేదుగా
X

కృతి కర్బందా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'తీన్ మార్'.. సుమంత్ 'బోణి' చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ అటుపై క‌న్న‌డ రంగంలో వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది. ఇట‌వ‌ల హిందీ చిత్ర‌సీమ‌లోను వెలుగులు విర‌జిమ్ముతంది. మ‌రోవైపు స‌హ‌న‌టుడు గౌర‌వ్ అరోరాతో కృతి కర్బందా సంబంధంలో ఉందంటూ ప్ర‌చారం సాగింది. కానీ ఆ రిలేష‌న్ బ్రేక్ అయిందంటూ మ‌రో క‌థ‌నం ఇటీవ‌ల వెబ్ లో వైర‌ల్ అయింది.


ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే కృతి సిద్ధార్థ్ మల్హోత్రా స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇంత‌కుముందే క‌థ‌న‌లొచ్చాయి. కృతి- సిద్ధార్థ్ ఇటీవల ఒక షూటింగ్‌లో కలిసి కనిపించడంతో బాలీవుడ్‌లో అది పుకార్ల‌కు దారి తీసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుద‌ల కావాల్సి ఉంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో కృతి స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2018లో మోహిత్ సూరి దర్శకత్వం వహించిన 'స్మార్ట్‌ఫోన్' ప్రకటన కోసం కృతి-సిద్ధార్థ్ జంటగా క‌నిపించారు. వాలెంటైన్స్ డే కోసం ప్రత్యేకంగా వాణిజ్య ప్రకటన రూపొందించగా అంద‌మైన జంట‌కు అభిమానులు ఫిదా అయ్యారు.

ఇక కృతి సోష‌ల్ మీడియాల్లోను ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా స్పీడ్ ని ప్ర‌ద‌ర్శిస్తోంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీటిస్తోంది. తాజాగా కృతి షేర్ చేసిన హాట్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వేడి పెంచుతోంది. కృతి సిమెంట్ క‌ల‌ర్ బికినీ ధ‌రించి హాట్ లుక్ తో క‌వ్వించింది. దీనికి ''ఐ పెయింట్ మై మూడ్ ఇన్ షేడ్స్ ఆఫ్ బ్లూ'' అంటూ ఆస‌క్తిక‌ర ట్యాగ్ ని జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దీనికి అభిమానుల నుంచి స్పంద‌న‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. తీన్ మార్ పిల్ల స్పీడ్ త‌గ్గ‌లేదు క‌దా! అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించారు.