Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : తీన్‌మాన్ బ్యూటీ కవ్వించే షో

ఇటీవలే ఈ అమ్మడు తన సినీ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది

By:  Tupaki Desk   |   20 Jun 2024 10:35 AM GMT
పిక్ టాక్ : తీన్‌మాన్ బ్యూటీ కవ్వించే షో
X

15 ఏళ్ల క్రితం బోణీ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఇటీవలే ఈ అమ్మడు తన సినీ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో ఆ పోస్ట్‌ కాస్త వైరల్‌ అయ్యింది.

తన జీవితంలో ఎక్కువ శాతం నటిగానే కొనసాగడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. బిజీ బిజీగా సినిమాలు చేయకున్నా కూడా తెలుగు, హిందీ ఇతర భాషల్లో క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం చాలా సంతృప్తిని కలిగించిందని కూడా పేర్కొంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. 35 ఏళ్ల వయసులో ఈ అమ్మడు ఇంకా కూడా 20 ఏళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే ఉందంటూ నిరూపించే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విభిన్నమైన ఈ ఔట్‌ ఫిట్‌ లో పై బటన్ పెట్టి షర్ట్‌ మొత్తం కింది బటన్స్ వదిలేయడం ద్వారా భలే క్రేజీగా ఉందంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇలాంటి డిఫరెంట్‌ స్టైల్‌ ఔట్‌ ఫిట్‌ ను ధరించేందుకు, దాంతో మెప్పించేందుకు ఘట్స్ కావాలని, ఆ ఘట్స్ ఈ అమ్మడికే ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో రామ్‌ చరణ్ కి అక్క పాత్ర లో బ్రూస్‌ లీ సినిమాలో నటించింది. ఆ తర్వాత నుంచి పెద్దగా కనిపించలేదు. అయితే ఈమె వెబ్‌ సిరీస్ లతో పాటు ఉత్తరాదిన చిన్న సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూనే ఉంది. మళ్లీ సౌత్ లో ఈ అమ్మడు ఎప్పటికి అడుగు పెట్టేనో చూడాలి.