Begin typing your search above and press return to search.

ప్లాప్ సినిమాకి ప్ర‌త్యేక స్థానం ఇచ్చిన హీరోయిన్!

తాజాగా అమ్మ‌డు త‌న కెరీర్ లో ప్లాప్ సినిమా అయిన రాబ్తా గురించి ఎంతో గొప్ప‌గా చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   12 May 2024 5:24 AM GMT
ప్లాప్ సినిమాకి ప్ర‌త్యేక స్థానం ఇచ్చిన హీరోయిన్!
X

ఏ హీరోయిన్ అయినా హిట్ అయిన సినిమాల గురించి చెబుతారు. ఆ సినిమా త‌న కెరీర్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో? ఎంతో సంతోషంగా పంచుకుంటారు. కానీ కృతి స‌న‌న్ మాత్రం అందుకు భిన్నం. హిట్ అయిన సినిమాకి బధులు ప్లాప్ సినిమా గురించి చెప్పి..త‌న కెరీర్ లో ఆ సినిమా త‌న‌ని ఎంత‌గామార్చిందో చెప్పి అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసింది. ఇటీవ‌లే 'ది క్రూ'తో భారీ స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు సాధించ‌డంతో అమ్మ‌డి ఆనందానికి అవ‌దుల్లేవ్. అంత‌కుముందే జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు సైతం అందుకుంది. ఇలా రెట్టించిన ఉత్సాహంలో కొన్ని అంశాల‌పైనా అంతే ఓపెన్ గా మాట్లాడుతోంది. నెగిటివ్ అయినా...పాజిటివ్ అయినా తాను అనుకున్న‌ది మాత్రం నిర్మొహ‌మాటంగా చేప్పేస్తోంది. తాజాగా అమ్మ‌డు త‌న కెరీర్ లో ప్లాప్ సినిమా అయిన రాబ్తా గురించి ఎంతో గొప్ప‌గా చెప్పుకొచ్చింది.

ఆ సినిమా త‌న‌ని ఎంత‌గా మార్చిందో రివీల్ చేసింది. 'బాలీవుడ్ లో రాబ్తా నాకు మూడ‌వ చిత్రం. ఈసినిమా అంచ‌నాలు అందుకోలేదు. అయినా ఆ సినిమా ప్లాప్ అయింద‌ని నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే అందులో పాత్ర కోసం చాలా క‌స‌ర‌త్తులు చేసాను. గుర్ర‌పు స్వారీ నేర్చుకున్నా...నీటిలో స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నా. ఆ రెండింటిలో అనుభ‌వం గ‌డించానంటే రాబ్తా నే కార‌ణం. ఆసినిమా చేయ‌క‌పోతే ఆ రెండింటి గురించి ఎప్పుడు నేర్చుకునే దాన్నో తెలియ‌దు.

కెరీర్ ఆరంభంలోనే అలాంటి పాత్ర‌లు చేస్తే మ‌రింత ప‌రిణితి చెంద‌డానికి అవకాశం ఉంటుంది. న‌టిగా ఎదిగే క్ర‌మంలో ఇలాంటి అవ‌కాశాలు రావ‌డం అదృష్టంగానే భావించాలి. అందుకే ఈ సినిమాకి నా మ‌న‌సులో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. జీవితం మొత్తంలో ఎన్నిసినిమాలు చేసినా..ఎంత గొప్ప పాత్ర‌లు పోషించినా ఆ స్థానాన్ని మాత్రం మ‌రే సినిమా భ‌ర్తీ చేయ‌లేదు. ఎన్నో సంతోష‌క‌ర‌మైన జ్ఞాప‌కాలు ఈ సినిమా అందించింది' అని అన్నారు.