బాలీవుడ్ గోల్డెన్ లెగ్ టాలీవుడ్‌లో ఐరన్ లెగ్!
ఇదే దూకుడుతో వరుస చిత్రాల్లో ఈ భామ నటిస్తోంది. కానీ టాలీవుడ్ లో ఘనమైన కంబ్యాక్ కావాలని ఆశపడుతోందట.
By: Tupaki Desk | 15 Aug 2024 2:30 PM GMTఅవును నిజమే! బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా గుర్తింపు ఉన్న ఒక పాపులర్ నటి టాలీవుడ్ లోకి వచ్చేప్పటికి ఐరన్ లెగ్ గా మారుతోంది. తను నటించిన మొదటి భారీ తెలుగు సినిమా డిజాస్టర్. రెండో సినిమా ఫ్లాప్. మూడో సినిమా టూమచ్ డిజాస్టర్. ఈ బ్యాడ్ రికార్డ్ ఉన్నా కానీ, తాను మళ్లీ మళ్లీ టాలీవుడ్ లో నటించాలని కోరుకుంటోందట ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరీ భామ? అంటే .. నిస్సందేహంగా కృతి సనోన్.
ఈ గ్లామరస్ క్వీన్ ప్రతిభ గురించి వేలెత్తి చూపించిన వాళ్లే లేనే లేరు. కానీ కెరీర్ లో ఆశించిన సక్సెస్ అయితే రాలేదు. ఇటీవల కొన్ని విజయాలు, అనూహ్యంగా జాతీయ అవార్డ్ నటిగా కెరీర్ గ్రాఫ్ ని ఒక్కసారిగా పైకి లేపాయి.కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్.
తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార సరసన '1-నేనొక్కడినే' చిత్రంలో నటించింది. తనదైన అందం, నటన , డాన్సింగ్ స్కిల్.. అన్నీ వున్నా ఈ హా* హీరోయిన్ ను ఇక్కడ దురదృష్టం వెంటాడింది. మహేష్ తో నటించిన 1 నేనొక్కడినే డిజాస్టరైంది. నాగచైతన్య సరసన నటించిన 'దోచేయ్' యావరేజ్ గా ఆడింది. ప్రభాస్ తో చేసిన ఆదిపురుష్ ట్రేడ్ గగ్గోలు పెట్టేంత పెద్ద డిజాస్టరైంది. భారీ నష్టాలొచ్చాయి. క్రిటికల్ గా విమర్శల పాలైంది. టాలీవుడ్ లో ఈ మూడు పరాజయాలు తనని చాలా కలతకు గురి చేసాయి. తిరిగి ఈ పరిశ్రమలో ప్రయత్నించాలని అనుకున్నా, తనను ఎక్కడ ఐరెన్ లెగ్ అంటారోనని భయపడుతోందట. అంటే మానసికంగా ఆ పరాజయాలు తనను ఎంతగా దెబ్బ తీసాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే టాలీవుడ్ కెరీర్ కి భిన్నంగా ఇపుడు బాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ క్రూలో టబు, కరీనా లాంటి సీనియర్లతో అదరగొట్టేసింది. కృతి గ్లామరస్ ట్రీట్ ఫన్నీ యాక్ట్ అందరినీ ఆకట్టుకుంది. మహేష్ బాబు , ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ తో కలిసి యాక్ట్ చేసినా దక్కని ఫలితం లేడీ ఓరియెంటెడ్ మూవీతో అందుకుంది. అది పురుష్ సినిమాలో సీత గా నటించినా కానీ, గతంలో సీత గా నటించిన వారికి వచ్చిన గుర్తింపు తనకి రాకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తాను ఎన్నో హోప్స్ పెట్టుకున్న ప్రభాస్ సైతం తనను గండం నుంచి బయటపడ వేయలేకపోయాడని బాధ పడిందట.
అదంతా అటుంచితే హిందీ చిత్రసీమలో కృతి నటిగా గుడ్ ఫేజ్ లో ఉంది. మిమి సినిమాలో అద్భుత నటనకు జాతీయ అవార్డును సైతం అందుకున్న కృతి, ఇటీవల క్రూ సినిమాతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇదే దూకుడుతో వరుస చిత్రాల్లో ఈ భామ నటిస్తోంది. కానీ టాలీవుడ్ లో ఘనమైన కంబ్యాక్ కావాలని ఆశపడుతోందట. మహేష్, చైతన్య, ప్రభాస్ ఇప్పటికే అవకాశాలిచ్చారు. తదుపరి చరణ్, బన్ని, ఎన్టీఆర్ లాంటి స్టార్లు అవకాశాలిస్తారని వేచి చూస్తోందట. మరి ఈ టాలెంటెడ్ బ్యూటీకి మరోసారి టాలీవుడ్ లో ఏ హీరో అవకాశం ఇస్తాడో చూడాలి.