Begin typing your search above and press return to search.

ఆమె కంటే అతడు 10 ఏళ్లు చిన్న.. పుకార్లపై క్లారిటీ

ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా కృతి సనన్‌ నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు

By:  Tupaki Desk   |   13 Aug 2024 11:44 AM GMT
ఆమె కంటే అతడు 10 ఏళ్లు చిన్న.. పుకార్లపై క్లారిటీ
X

పదేళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌ గా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. మొదటి సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచిన కూడా తెలుగు లో మరి కొన్ని ఆఫర్లు వచ్చాయి. అవి కూడా పెద్దగా ఆడలేదు. దాంతో బాలీవుడ్‌ కు ఈ అమ్మడు వెళ్లి పోయింది. అక్కడ మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చే స్థాయిలో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా కృతి సనన్‌ నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి కృతి సనన్‌ తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు అయిన యూకే కుర్రాడు కబీర్‌ బహియా తో డేటింగ్‌ లో ఉందని, ఇద్దరు కలిసి ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ మధ్య ఒక కార్యక్రమంలో ఇద్దరు కలిసి పాల్గొనడం తో పాటు, ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారని, ఇద్దరి మధ్య రిలేషన్‌ కి ఇదే సాక్ష్యం అన్నట్లుగా కొన్ని ఫోటోలు మరియు వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. వీరి గురించి పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఆమె తో పలువురు మీడియా వారు మాట్లాడేందుకు ప్రయత్నించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్వయంగా కృతి క్లారిటీ ఇచ్చింది.

కృతి సనన్ మాట్లాడుతూ... నా గురించి తప్పుడు వార్తలు రాసినప్పుడు నాతో పాటు నా కుటుంబ సభ్యులు అంతా కూడా బాధపడతారు అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎలాంటి వార్తలు అయినా సోషల్‌ మీడియాలో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఆ వార్తలు నిజమే అని చాలా మంది నాకు మెసేజ్ లు చేస్తున్నాను. నన్ను చాలా మంది ఆ విషయమై సంప్రదిస్తున్నారు. ఈ అబద్దాలు నాకు చాలా చిరాకు ను తెప్పిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు అయిన కుర్రాడితో కృతి సనన్‌ డేటింగ్‌ అంటూ వచ్చిన హెడ్డింగ్స్ నాకు తీవ్ర కోపాన్ని తెచ్చి పెట్టాయని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

నిజాలు తెలుసుకోకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడటం, కామెంట్స్ చేయడం బాధ కలిగించింది. ఎదుటి వారి గురించి తప్పుడు వార్తలు రాయడం అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందనే విషయం తెలియదా అని ప్రశ్నించింది. పుకార్లపై కృతి సనన్‌ స్పందించిన తీరుకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పుడు వార్తలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చినట్లయితే మరిన్ని తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. కనుక వెంటనే కృతి సనన్ స్పందించడం అభినందనీయం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.