సీతమ్మ@10 ఏళ్లు..ఇప్పటికీ అదే అనుభూతి!
ఈ అమ్మడు సినీ ప్రయాణం మొదలు పెట్టి నేటితో దశాబ్ధం పూర్తవుతుంది.
By: Tupaki Desk | 24 May 2024 1:30 PM GMTకృతిసనన్ అలియాస్ సీతమ్మ గురించి పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుని భారతీయుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎంతో మంది సీనియర్ నటీమణలు.. సహ చరులు ఉన్నా ఎవరికీ సాధ్యం కానిది చిన్న వయసులోనే సాధ్యం చేసింది. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి అనతి కాలంలో నే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేడు నవతరం భామలకు ఆదర్శంగానూ నిలుస్తోంది.
ఈ అమ్మడు సినీ ప్రయాణం మొదలు పెట్టి నేటితో దశాబ్ధం పూర్తవుతుంది. ఈ సందర్బంగా ఇన్ స్టాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. `నా జీవితంలో ఇప్పటి వరకూ నేను చూడని అద్భుతమైన క్షణాలివి. మొదటిసారి సినిమా సెట్ లో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో? ఇప్పటికీ ఇంకా అలాగే అనిపిస్తుంది. సెట్ లో కాలు పెడితే మొదటి సినిమాకి కలిగిన భ్రాంతి కలుగుతుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.
ఎంతో మంది గొప్ప స్నేహితుల్ని కలిసాను. ఎప్పటికీ నవ్వించే జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. నా ప్రయాణంలో భాగమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని మరింత అలరించడానికి నావంతు ప్రయత్నం చేస్తానని` రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. కృతిసనన్ తెరంగేట్రం తెలుగులో జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కంటే ముందే తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందే మ్యాకప్ వేసుకుంద.
మహేష్ హీరోగా నటించిన `వన్ నేనొక్కడినే` చిత్రలో ఈ భామనే హీరోయిన్ . అటుపై `దోచెయ్` సినిమా చేసింది. కానీ ఆ రెండు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. లక్కీగా అక్కడ క్లిక్ అయింది. వరుస విజయాలు అమ్మడిని స్టార్ గా నిలబెట్టాయి. ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా సినిమా `ఆదిపురుష్` లో సీతమ్మగా నటించింది. ఆ పాత్రతో టాలీవుడ్ లో సీతమ్మగా ఫేమస్ అయింది.