Begin typing your search above and press return to search.

మీనా కుమారి పాత్ర కోసం రేయింబ‌వ‌ళ్లు!

దిగ్గ‌జ న‌టి..దివంగ‌త మీనా కుమారి జీవితం ఆధారంగా ఓ చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Aug 2023 5:56 AM GMT
మీనా కుమారి పాత్ర కోసం రేయింబ‌వ‌ళ్లు!
X

దిగ్గ‌జ న‌టి..దివంగ‌త మీనా కుమారి జీవితం ఆధారంగా ఓ చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మీనా కుమారి పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టిస్తోంది. ఈ సినిమాతో ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం ఆ సినిమా క‌థ‌కి సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నారు. తాజాగా మీనాకుమారి పాత్ర కోసం కృతిస‌న‌న్ ఎలా సిద్ద‌మ‌వుతుందో రివీల్ చేసింది. మేటి న‌ట‌న‌తో భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు..గౌర‌వం అందుకున్న మీనాకుమారి లాంటి గొప్ప వ్య‌క్తి బ‌యోపిక్ చేస్తుండ‌టం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నా.

ఆమె పాత్ర‌లో ఆత్మ ని ప‌ట్టుకోవ‌డానికి ఎంతో శ్ర‌మించాల్సి వ‌స్తోంది. అవ‌గాహన పెంచుకోవ‌డం కోసం మీనా కుమారి న‌టించిన పాత సినిమాల‌న్నింటిని చూస్తోందిట‌. `బైజు బాబ్రా`..`సాహెబ్ బీబ్ ఔర్ గులామ్`.. `పాకీజా` లాంటి క్లాసిక్ చిత్రాల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తోందిట‌. మీనా కుమారి వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప్ర‌ధానంగా హైలైట్ చేయ‌డంతో ఆమెకు సంబంధించిన పాత ఇంట‌ర్వ్యూలు అన్నీ ఏ ఒక్క‌టీ మిస్ కాకుండా చూస్తోందిట‌. అలాగే ఆమె జీవిత చ‌రిత్ర‌కి సంబంధించిమార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్నీ పుస్త‌కాలు కొనిక్కుని చ‌దువుతుందిట‌.

ఒక్కోసారి ఆ పుస్త‌కాలు తెల్లవారే వ‌ర‌కూ చ‌ద‌వాల్సింది వ‌స్తోందిట‌. ఇంకా చాలా పుస్త‌కాలు...సినిమాలు చూడాల్సి ఉంద‌ని..అందుకు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని అంటోంది. మొత్తానికి కృతిస‌న‌న్ -మీనా కుమారి బ‌యోపిక్ కోసం అన్ని ర‌కాలుగా స‌న్న‌దం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో బ‌యోపిక్ లో కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అక్క‌డ బ‌యోపిక్ లు చేస్తే సంచ‌ల‌నం అవ్వాల్సిందే. చాలా అరుదుగానే ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల్ని అందుకోలేదు.

ఈ నేప‌థ్యంలో మీనా కుమారి బ‌యోపిక్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే మనీష్ మ‌ల్హోత్రాకి ఇదే తొలి సినిమా కావ‌డం...అందులోనూ బ‌యోపిక్ ని చూజ్ చేసుకోవ‌డం అన్న‌ది ఛాలెంజింగ్ అంశం. మ‌రి మీనా కుమారి బ‌యోపిక్ హిట్ తో ఆమెకు ఘ‌న‌మైన నివాళి అందించాల‌ని ఆశిద్దాం.