Begin typing your search above and press return to search.

జీన్స్ నిక్క‌రులో జివ్వుమ‌నిపించిన బ్యూటీ!

వ‌చ్చిన ఫేంతో సంపాదించుకోవ‌డ‌మే కాన్సెప్ట్ కాకుండా న‌టిగా చిర‌స్థాయిలో నిలిచిపోయే స్థానం కోసం పోటీ ప‌డుతుంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:30 AM GMT
జీన్స్ నిక్క‌రులో జివ్వుమ‌నిపించిన బ్యూటీ!
X

బాలీవుడ్ లో కృతి స‌న‌న్ రేంజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇటీవ‌లే `ది క్రూ`తో మ‌రో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. కొత్త ప్రాజెక్ట్ ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆఫ‌ర్లు వ‌స్తున్నా? మంచి క‌థ‌ల‌కే ప్రాధాన‌త్య అంటూ ముందుకెళ్తుంది. వ‌చ్చిన ఫేంతో సంపాదించుకోవ‌డ‌మే కాన్సెప్ట్ కాకుండా న‌టిగా చిర‌స్థాయిలో నిలిచిపోయే స్థానం కోసం పోటీ ప‌డుతుంది. అందుకోసమం ప్ర‌త్యేక‌మైన ప్ర‌ణాళిక వేసుకుని ముందుకెళ్తోంది.


న‌టిగా స‌క్స‌స్ అయిన నేపథ్యంలో నిర్మాత‌గానూ బ్యాన‌ర్ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. `దో ప‌త్తి` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి చిత్రం కావ‌డంతో ఓటీటీలోనే దీన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతానికి కృతి స‌న‌న్ ఈ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉంది. ఇంకా కొత్త ప్రాజెక్ట్ లు వేటికి సైన్ చేయ‌లేదు. కానీ నెట్టింట మాత్రం హాట్ ఫోటోల‌తో అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంటుంది.


ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ల‌తో కుర్ర కారుని అల‌రిస్తుంది. తాజాగా అమ్మ‌డు హాట్ ఫోటో ఒక‌టి లీకైంది. ఇందులో అమ్మ‌డు జీన్స్ నిక్క‌ర్ టాప్ పై మ్యాచింగ్ సార‌ల రంగు బ‌నియ‌న్ ధ‌రించిం చింది. షోల్డ‌ర్ నుంచి థై స్ స‌హా బ్యాక్ బ్యూటీని క‌వ‌ర్ చేస్తే వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ ధ‌రించింది. క‌ళ్ల‌కు స‌న్ గ్లాసెస్ పెట్టుకుంది. పాల నురుగ‌ల సౌంద‌ర్యంతో అమ్మ‌డు మెరిసిపోతుంది.


బేసిక్ గానే అమ్మ‌డు ప్యూర్ వైట్. అదే బ్యూటీకి మ్యాక‌ప్ తోడైతే షైనింగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. సూర్య కాంతి సైతం అమ్మ‌డి కాంతి చిన్న బోతుందా? అనిపిస్తుంది. మ్యాక‌ప్ స‌హా ప్ర‌తీది సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. కాళ్ల‌కు వైట్ క‌ల‌ర్ సాండిల్స్ ధ‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.